జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ బదిలీ

0 10

నెల్లూరు    ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ బదిలీ అయ్యారు. సుమారు 2 సంవత్సరాల క్రితం జిల్లా ఎస్పిగా వచ్చిన భాస్కర్ భూషణ్ సౌమ్యుడిగా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజా ఫిర్యాదు పై ఎస్ పి ని కలిస్తే ,స్పందించే తీరు ఆయనలో ఉందని పేరు కూడా ఉంది. అయితే  కొందరి నాయకులతో కొన్ని విషయాలలో పరిపాలనా పరమైన  విభేదాలు నెలకొనడం తో  ఎస్పీ బదిలీ చేసేందుకు  ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా  కోవూరు నియోజకవర్గంలో  కోవిడ్  నిబంధనలు  ఉల్లంఘించిన విషయం పై కొందరు అధికారుల పై కేసు నమోదు చేయడంతో  కోవూరు శాసనసభ్యులు  ఎస్పి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా ఆయన బదిలీ కోసం అధికార పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లాలోని కొంతమంది ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పి కి మధ్య విభేదాలు రావడంతో  ఎమ్మెల్యేల నుంచి బహిరంగంగానే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కూడా తన బదిలీ కోసం స్వయంగా ప్రయత్నాలు కూడా చేసుకొన్నారు. ఈ మేరకు ఆయన బదిలీ జరిగింది. అయితే నెల్లూరు జిల్లా ఎస్పీ గా ఇంకా ఎవరిని నియమించలేదు. జిల్లా ఎస్పీగా వచ్చేందుకు అనేకమంది రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్పీ భాస్కర్ భూషణ్ ను కేంద్ర సర్వీసులకు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ లోని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లో డిప్యూటీ సెక్రటరీ గా 4 ఏళ్ల పాటు ఆయన పనిచేయనున్నారు…. జిల్లా నూతన ఎస్పి రేసులో అమ్మి రెడ్డి, పకీరప్పలు. ప్రస్తుత గుంటూరు రూరల్ ఎస్పీ అమ్మి రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ పకీరప్పలు ముందు వరుసలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పై ఇద్దరు ఎస్పీలు  ఇప్పటికే నెల్లూరు నూతన ఎస్పీగా వచ్చేందుకు తమ తమ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా స్థానికులైన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి లు కూడా పరిధిలో ఎవరినో ఒకరిని జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రజాభిప్రాయం వినిపిస్తుంది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Transfer of District SP Bhaskar Bhushan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page