టీడీపీ నేతలవి శవరాజకీయాలు

0 11

గుంటూరు  ముచ్చట్లు:
టీడీపీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యలపై  హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హేయమైన చర్య అని అమె అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే హత్యలు చేస్తామని చెప్పకనే చెబుతున్నట్లు ఉంది. టీడీపీ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదు. వ్యక్తిగత కారణాలను కూడా టిడిపి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోంది. టీడీపీ నాయకులకు శవ రాజకీయాలు చేయడం అలవాటైందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా టీడీపీ ఆరోపణలు చేస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదని స్పష్టంచేసారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ లని కూడా చూడకుండా ప్రతిఒక్కరికీ మంచి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదు కనుకనే ఘోరమైన ఓటమి పొందారు. టీడీపీ హయాంలో జరిగిన రాజకీయ హత్యల గురించి ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల్లో వస్తున్న మంచి పేరును చూసి టీడీపీ ఓర్వలేక పోతోందని హోంమంత్రి అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:TDP leaders are funerals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page