డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన

0 14

జగిత్యాల   ముచ్చట్లు:
మేడిపల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం అసంపూర్ణ నిర్మాణంలో నిలిపివెయ్యడాన్ని నిరసిస్తూ బీజెపి అధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. మేడిపల్లి మండల కేంద్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం అసంపూర్తిగా ఉంచి లబ్ధిదారులకు నిరాశని కలిగించిందని, అసంపూర్తిగా ఉన్న ఇండ్లు నాసిరకం గా ఉన్నందున కూలిపోయే దశలో ఉండటంతో లబ్ధిదారులకు న్యాయం చెయ్యాలని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి,  భాజాపా యువ మోర్చా ప్రదాన కార్యదర్శి క్యాతం మహేందర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు గోస్కి మధు, ఎస్ ఎన్ రెడ్డి, అధికార ప్రతినిధి దాసరి రఘు, ప్రధాన కార్యదర్శి నాగేల్లి మహేస్ బీజేయమ్ ఉపాధ్యక్షులు రాము, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:The structure of the double bedrooms is unfinished
BJP-led protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page