నకిలీ పట్టాల కలకలం

0 32

చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో నకిలీ పట్టాల కలకలం రేగింది. సీ.రామాపురంలోని సర్వే నెంబర్ 28లో ప్రభుత్వ భూమి కాజేసేందుకు కొందరు కబ్జా రాయుళ్ళు ఏకంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహశీల్దార్ స్పందిస్తూ ఫోర్జరీకి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు.
రామచంద్రాపురం మండలం, సీ.రామపురం లెక్కదాఖలా సర్వే నెంబర్ 28లో ఉన్న ఒక కోట యాభై లక్లల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్ళు కళ్లు పడింది. ఎలాగైనా కాజేయాలనే నెపంతో 2014లో అక్కడ విధులు నిర్వహించిన తహశీల్దార్ క్రిష్ణయ్య పట్టాలు మంజూరు చేసినట్లు రికార్డులు సృష్టించారు. ఆయన చనిపోయిన కూడా 17/06/2007 వ తేదీన రికార్డులలో నమోదయ్యేటట్లు కొందరు రెవెన్యూ అధికారులు కబ్జా రాయుళ్ళుకు సహకారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. సుమారు 8మంది ఒక్కోక్కరు మూడు సెంట్లు చొప్పున ఫోర్జరీ సంతకాలతో రికార్డులు సృష్టించుకున్నట్లు బట్టబయలైంది. అంతటితో ఆగకుండా గ్రామస్థులు జిల్లా కలెక్టర్ దృష్టికి కబ్జా రాయుళ్ళు బాగోతాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే విచారణ నిమిత్తం ఆర్డీవో కు ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ విధులలో భాగంగా విచారణ ఆలస్యం అవుతోందని రెండు రోజుల్లో విచారణ చేపట్టి పూర్తి నివేదిక కలెక్టర్ అందజేస్తామని డిప్యూటీ తహశీల్దార్ మునిశైలజా మీడియాకు వివరించారు. ఫోర్జరీకి పాల్పడినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

- Advertisement -

Tags:The frenzy of fake rails

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page