నిబంధనల ప్రకారమే పని చేశాం-ఎంపీ నామా నాగేశ్వరరావు

0 6

హైదరాబాద్ ముచ్చట్లు :

 

నా గురించి ప్రజలందరికీ తెలుసు నేను నీతి నిజాయితీ తో ఉంటాను.  ప్రజలకు సేవ చేసేందుకు రాజ్యాంగ వ్యవస్థ అనే బాటలో ముందుకు వెళ్తున్నని లోక్ సభలో టీ ఆర్ ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మా నాయకుడు కేసీఆర్ బాటలో నేను నడుస్తా- నా బలం కేసీఆర్- నా బలగం ఖమ్మం ప్రజలు.  ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కేసీఆర్ వెంటనే నడుస్తా ఉంటా!. 40 ఏళ్ల క్రితం మధుకాన్ సంస్థను నేను స్థాపించాను.  వాజ్ పాయ్ హయాంలో గోల్డెన్ క్వాటరీ ఈ సంస్థలు పూర్తీ చేసాయి.  చైనా బోర్డర్ లో మదుఖాన్ కంపెనీలు పనిచేస్తున్నాయి.  కంపెనీల్లో నేను డైరెక్టర్ గా లేను- మా తమ్ముళ్లు చూస్తున్నారు.  2011లో రాంచీ ఎక్స్ప్రెస్ వే 160కిలోమీటర్ల ప్రాజెక్టు తో మొదలైంది.  16వందల కోట్ల ప్రాజెక్టులో 460 కోట్లు కంపెనీ ఇవ్వాలి. మిగతా అమౌంట్ బ్యాంక్ లు ఇవ్వాలి.  బ్యాంకు ప్రాజెక్టు మీద 652కోట్లు మాత్రమే పెట్టింది.  వడ్డిగా 378 కోట్లు తీసుకుంది.  అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో ప్రాజెక్టు రద్దు చేసాము.  టర్మీనెట్ చేసే సమయానికి 60శాతానికి పైగా ప్రాజెక్టు వర్క్ అయింది.  ఎస్క్రు అకౌంట్ కు వందశాతం పవర్ బ్యాంక్ కు మాత్రమే ఉంది- కంపినికి లేదని అన్నారు.

 

 

 

- Advertisement -

కాంట్రాక్టు నిబంధనల ప్రకారం మేము పనిచేసాము.  కంపినికి జరిగిన అన్యాయానికి అర్పిట్రేజన్ ట్రిబ్యునల్ కు వెళ్ళింది.  ప్రాజెక్టు పై మూడు కాంట్రాక్టు లు ఉన్నాయి.  ప్రాజెక్టు పై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు!.  దేశవ్యాప్తంగా బిఓటి ప్రాజెక్టు నిబంధనలు కేంద్రం మార్పులు చేసింది.  ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పూర్తిగా మేము సహకరిస్తాం.  రాజ్యాంగం- ట్రిబ్యునల్ పై పూర్తి నమ్మకం వుంది.  మొదటి నుంచి కంపెనీలో నేను లేను.  బీహార్ లో చెట్లు కొట్టి వేస్తున్నారు అని 2014లో పిల్ వేశారని అయన అన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: We worked according to the rules – MP Nama Nageswararao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page