పుస్తకాలపై కరోనా ప్రభావం

0 27

హైదరాబాద్  ముచ్చట్లు:
ద్యాసంవత్సరం ప్రారంభమవుతుందంటే సహజం గానే సందడి వాతావరణం నెలకొంటుంది. పాఠ్యపుస్త కాలు, నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగ్‌లు, టై, షూ, బట్టలు ఇలా అవసరమైన వాటిని తల్లిదండ్రులు కొను గోలు చేస్తారు. కరోనాకు ముందు వరకు ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ మయ్యే సమయంలో స్టేషనరీలు, పాఠ్యపుస్తకాల విక్రయ సంస్థలు కిటకిటలాడతాయి. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆర్థికంగా ఎంతో పరిపుష్టిగా ఉండడంతో వాటి యజమానులు ఆనందంగా ఉండేవారు. కరోనా ప్రభావం పాఠ్యపుస్తకాల విక్రయాలపైనా పడింది. స్టేషనరీలనూ కరోనా కాటేసింది. పుస్తకాల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. రెండేండ్లుగా విక్రయాల్లేక స్టేషనరీలు వెలవెలబోతున్నాయి. పుస్తకాలు కొంటేనే అనుబంధ వస్తువులకు గిరాకీ ఉంటుంది. కరోనా, లాక్‌డౌన్‌, విద్యాసంస్థలు ప్రారంభం కాకపోవడం, విద్యార్థులు బడులకు వెళ్లకపోవడం వంటి కారణాలతో పుస్తకాలు కొనేవారు కరువయ్యారంటే అతిశ యోక్తికాదు. పుస్తకాల అమ్మకాలే లేకపోవడంతో స్టేషనరీల యజమానులు దివాళా తీశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దుకా ణాల కిరాయిలు చెల్లించడం కష్టంగా మారిం దని పలు వురు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాల్లేక అప్పులపాలవు తున్నా మని మనోవేదన చెందుతున్నారు.

 

ఇంకో వైపు స్టేషనరీలపై ఆధారపడ్డ అనేక మంది జీవితాలు ఛిద్రమ య్యాయి. వాటిలో పనిచేస్తున్న వారిని యజమానులు తొలగిం చడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అటు యజమానులు, ఇటు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసింది. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ బోధనను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. కానీ తరగతి గది బోధనకు ఆన్‌లైన్‌ విద్య ప్రత్యామ్నాయం కాదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో బోధన, చదువులు ఉండడంతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ద్వారానే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. పుస్తకాలు ఉంటాయన్న సంగతిని చాలా మంది విద్యార్థులు మరిచిపోయారంటే నమ్మశక్యం కాదు. ఉపాధ్యాయుల బోధన తర్వాత పాఠ్యపుస్తకాల చదివి విద్యార్థులు బాగా సాధన చేస్తేనే ఆ పాఠాలు గుర్తుం డిపోతాయనీ, విజ్ఞానం వస్తుందని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడు తున్నారు. ఇప్పుడు పుస్తకాలను కొనడం లేదు, పాఠాలను చదవడం లేదు. ఇక విద్యార్థులకు విజ్ఞానం, విద్య ఎలా వస్తుందన్న ప్రశ్న తల్లిదండ్రుల నుంచి వ్యక్తమ వుతున్నది. కరోనా వల్ల విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయని అభిప్రాయం వినిపిస్తున్నది. ఐదో తరగతి వరకు పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు లేకపోవడంతో వారికి వచ్చిన చదువును పూర్తిగా మరిచిపోయారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. కొందరు విద్యార్థులు వారు ఏ తరగతి చదువుతున్నారో సైతం గుర్తుకు లేని పరిస్థితి నెలకొంది. పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో వారి మానసిక ఎదుగుదల, బోధన పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతున్నది. వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను ఏటా అందిస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరానికి 1.43 కోట్ల పుస్తకాలు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే సగం పుస్తకాల ముద్రణ పూర్తయిందనీ, డీఈవో కార్యాలయాలకు పంపించామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ప్రయివేటు పాఠశాలల్లోని విద్యార్థులు పుస్తకాలను కొనాలి. రాష్ట్రంలో 40,898 పాఠశాలల్లో 59,26,253 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 30,135 ప్రభుత్వ పాఠశాలల్లో 26,88,805 మంది, 10,763 ప్రయివేటు బడుల్లో 32,37,448 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రయివేటు స్కూళ్లలోని విద్యార్థుల కోసం కోటికిపైగా పాఠ్యపుస్తకాలు ముద్రించాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే టెండర్లు ఖరారైనట్టు తెలిసింది. 2020-21 విద్యాసంవత్సరంలో 1.60 కోట్ల పుస్తకాలు అవసరమని భావించినా కరోనా నేపథ్యంలో 35 లక్షల పాఠ్యపుస్తకాలను అమ్మకం కోసం ముద్రించారు. అందులో 17 లక్షలు మాత్రమే విక్రయించబడ్డాయి. 18 లక్షల పుస్తకాలు అమ్ముడుపోలేదు. వాటిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలనీ లేదంటే ఇప్పుడు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని స్టేషనరీ యజమానులు, ప్రయివేటు ప్రింటర్ల యజమానులు కోరుతున్నారు. గతేడాది ముద్రించిన పుస్తకాలనే ప్రస్తుతం విక్రయిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Corona effect on books

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page