పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి వామపక్ష పార్టీల నిరసన  ఆర్డీవో కు వినతిపత్రం

0 20

జగిత్యాల    ముచ్చట్లు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా నిరంతరం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రతి వస్తువుపై ప్రభావం పడి సామాన్యుడి బ్రతుకు భారంగా మారిందని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎమ్, ఎఐఎఫ్టియు నాయకుల ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన తదుపరి ఆర్డీవో మధురికి వినతిపత్రం అందజేసి  ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎమ్, ఎఐఎఫ్టి.యు నాయకులు సూతారి రాములు, తిరుపతి నాయక్, ముడుగం రాజలింగు, లక్ష్మిలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డు అదుపు లేకుండా పెంచుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన మనుగడ కష్టంగా మారిందన్నారు. ప్రతి వస్తువుపై పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పడడంతో ధరలు అమాంతం పెరిగి కొనుగోలు శక్తి కరువవుతోందన్నారు. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేరడంతో సిలిండర్ కొనలేక కట్టెలతో వంట చేయలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేధించాలని కోరారు. పెంచిన ధరలను తగ్గించే వరకు వామపక్షాల పోరాటం అగదన్నారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ నాయకులు ఎండీ. ముక్రం, వెన్న సురేష్, అల్తాఫ్, న్యూ డెమోక్రసి నాయకులు చింత భూమేశ్వర్ తోపాటు పలువురు వున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Inflated petrol and diesel prices should be brought down immediately
Petition to Ardeavo to protest left parties

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page