భవన నిర్మాణాల పరిశీలన

0 22

– దేవనబండ గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు…

పత్తికొండ ముచ్చట్లు :

 

- Advertisement -

మండల పరిధిలోని దేవనబండ గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలను పరిశీలించామని పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాసులు అన్నారు. శనివారం రైతు భరోసా కేంద్రానికి స్థలాన్ని , గ్రామ సచివాలయం నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ నిర్మాణాలను జోరుగా సాగుతున్నాయని చెప్పారు. రైతు భరోసా కేంద్ర నిర్మాణాల కోసం అవ సరమైన స్థలాన్ని పరిశీలించి నిర్ణయించామన్నారు. గ్రామ సచివాలయ నిర్మాణాలకు 40 లక్షల రూపాయలు, రైతు భరోసా కేంద్రానికి 21 లక్షలు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు రూ 14.95 లక్షలు నిధులు వచ్చాయన్నారు. నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు, మందులు లభిస్తాయని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన పనుల కోసం పట్టణాలకు వెళ్లకుండా ఉన్న గ్రామంలోనే అన్ని సౌకర్యాలు అందేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇలాంటి సౌకర్యాలను రైతులు, ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొట్లపాటి ప్రవీణ, గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు రమేష్ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనిల్, డిజిటల్ అసిస్టెంట్ ఉదయ్, వాలంటీర్లు పాల్గొన్నారు.

 

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Inspection of buildings

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page