రాయదుర్గం పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలి

0 13

-రాష్ట్ర బీసీ సంఘం మహిళా నాయకురాలు మట్కా జయంతి గౌడ్ డిమాండ్
– జాతీయ బిసి కమిషన్ సబ్యులు టి.ఆచారికి వినతి పత్రం

 

హైదరాబాద్  ముచ్చట్లు :

 

- Advertisement -

సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంఘం మహిళా నాయకురాలు మట్కా జయంతి గౌడ్ డిమాండ్ చేసారు.ఈ మేరకు జాతీయ బిసి కమిషన్ సబ్యులు టి.ఆచారికి వినతి పత్రం సమర్పించారు.పై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని అలాగే మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలపై ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కాపాడవలసిన పోలీసులే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రవర్తిస్తున్న తీరును ఆమె తీవ్రంగా  ఖందించారు. పోలీసులం అన్న అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేయడం ఏ చట్టం లో ఉందని జయంతి ప్రశ్నించారు. డబ్బు ఉన్న వాళ్లకి ప్రాధాన్యత ఇచ్చి నిరుపేదల పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఇలాంటి పోలీసులను పోలీసులను సస్పెండ్ కాకుండా  ఉద్యోగాలు నుండి శాశ్వతంగా తొలగించాలని ఆమె డిమాండ్ చేసారు.

 

 

 

 

బీసీ,ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించిన పోలీసు లైన రాజకీయ నాయకులైన దీనికి సహకరించిన ఇంకెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకొని మహిళా నాయకుల పైనే ఇంత అగాయిత్యానికి పాల్పడిన పోలీసులను ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా లేదా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండకూడదాని పేర్కొన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు కావున చట్టాలు బలంగా ఉండాలి కాని బలహీనంగా ఉండకూడదన్నారు. చట్టాలను గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా మనం గౌరవించాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అంశాన్ని తీసేయాలని తప్పు చేసే వాళ్ళకి భయం కలగాలని తప్పు చేస్తే ఎవరికైనా ఒకే లాగా చర్యలు తీసుకోవాలని డబ్బు ఉన్న వాళ్లకి ఒకలాగా డబ్బు లేని వాళ్లకు ఒకలాగా కుల మత భేదాలు చూపించకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళల హక్కులను కాపాడాలని లేనిచో ప్రజలు తీసుకునే నిర్ణయానికి ప్రభుత్వాలు బలి కాక తప్పదని జయంతి హెచ్చరించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Strict action should be taken against Rayadurg police

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page