రాహుల్ గాంధీ జన్మదినం

0 8

సంగారెడ్డి   ముచ్చట్లు:
సంగారెడ్డి లో  ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా   సంగారెడ్డి లో 30 మంది వికలాంగులకు జగ్గారెడ్డి వీల్ చైర్లు అందజేసారు.  జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకురాలు జయారెడ్డి మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారులకు జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి ఆర్థిక సహాయం అందజేసారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ  రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని   30 మంది వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసాం.  ఈరోజు మొదలుకుని సంగారెడ్డి నియోజకవర్గం లో ఉన్న వికలాంగులందరికి వీల్ ఛైర్లు పంపిణీ చేస్తాం. రాష్ట్రం లో, కేంద్రం లో అధికారం లో వున్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. రాహుల్ గాంధీ సారథ్యం లో వచ్చే ఎన్నికల్ల్ రాష్ట్రం లో, కేంద్రం లో అధికారం లోకి వస్తామని అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Rahul Gandhi’s birthday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page