రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకాన్ని చేపట్టాలి

0 21

తుగ్గలి  ముచ్చట్లు:

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని ఏపీడి పద్మావతి మరియు ఏపీవో రామకృష్ణ లో తెలియజేశారు.శనివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక స్త్రీ శక్తి భవనం లో జరిగిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ త్వరితగతిన రోడ్డుకిరువైపులా మొక్కల పెంపక పనులను ప్రారంభించాలని టి.ఏ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లకు వారు తెలియజేశారు.త్వరితగతిన మండల పరిధిలో గల ప్రదేశాలను గుర్తించి జియో ట్యాగింగ్ చేసుకొని పనులను ప్రారంభించాలని వారు సిబ్బందికి తెలియజేశారు.అదేవిధంగా శనివారం రోజున ఏపీఓ రామకృష్ణ ఉపాధి పనులను పరిశీలించి మస్టర్ లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Plant cultivation should be carried out along the road

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page