విజయనగరంకోట రాజు గారు వర్సెస్ రెడ్డిగారు

0 41

విశాఖపట్టణం  ముచ్చట్లు:

రాజ్యాలకు మూల కారణం భూమి, రాజులకు అధికార సంకేతం భూమి. చరిత్రలో ఎక్కడ నుంచి తిరగేసినా కూడా భూమి కోసమే యుద్ధాలు జరిగినట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. ఆధునిక యుగంలో కూడా అదే జరుగుతోంది. అధికారంలోకి వచ్చే ప్రతీ పార్టీ భూమి చుట్టూనే రాజకీయం నడిపిస్తుంది. ఇదిలా ఉంటే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రతిపాదించిన దగ్గర నుంచి భూ బాగోతాలు ఎక్కువైపోయాయి. తరాలుగా భూములను గుప్పిట పట్టిన వర్గాలు ఎదురుతిరుగుతూంటే మొత్తం భూమిని ప్రభుత్వ పక్షం చేయాలని అధికార పార్టీ ఆరాటపడుతోంది.ఈ భూముల కధలు అక్రమాల నుంచి మొదలై ఇపుడు ట్రస్టుల వైపుగా కూడా కదులుతున్నాయి. భూమి ఎక్కడ ఉంటే వెంటనే వివాదం కూడా ఉంటుంది. ఉత్తరాంధ్రాలోని కబ్జా భూములను వెలికి తీస్తున్న క్రమంలో వేలాది ఎకరాలు ఉన్న సింహాచలం, అలాగే మాన్సాస్ ట్రస్ట్ చుట్టూ కూడా రాజకీయం సాగుతోంది. సింహాచలం భూములు ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు, రికార్డులు పక్కాగా లేకపోవడమే ఒక కారణం. ఇక ఇపుడు మాన్సాస్ చుట్టూ కూడా ఇదే వివాదం సాగుతోంది.విజయనగరం పూసపాటి వారి వంశాధీశుడు పీవీజీ రాజు 1958లో మాన్సాస్ ట్రస్ట్ స్థాపించారు. అలా వేలాది ఎకరాల భూములు ఈ ట్రస్ట్ కి ఉన్నాయని అంటారు. ఏపీలోనే కాదు, దేశంలో కూడా పలు చోట్ల మాన్సాస్ ట్రస్ట్ కి భూములు ఉన్నాయని అంటారు. ఇక పద్నాలుగు వేల ఎకరాల భూములు ట్రస్ట్ కి ఉన్నాయని ఒక లెక్క ఉంది. అంతే కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయని కూడా అంటున్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఇపుడు భూముల విషయంలోనే వివాదాల పాలు అవుతోంది. ట్రస్ట్ భూములను కాపాడుతామని ఒక వైపు చైర్మన్ అశోక్ గజపతిరాజు చెబుతూంటే మరో వైపు ఫోరెన్సిక్ విచారణ జరిపించి మరీ ట్రస్ట్ భూములు మొత్తం చిట్టాపద్దుల లెక్క సరిచేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు.మాన్సాస్ ట్రస్ట్ భూములలో 105 ఎకరాలను 2016లో ఒక జీవో తెచ్చి అమ్మేశారని విజయసాయిరెడ్డి అంటున్నారు. అంతే కాదు 2010లో కూడా అయిదు వందల ఎకరాల భూములు అమ్మేసుకున్నారని ఆరోపిస్తున్నారు. వీటన్నింటి మీద లెక్కలు తేలాలని ఆయన గట్టిగానే చెబుతున్నారు. ఇక సింహాచలం భూముల విషయంలో కూడా వివాదం అలాగే కొనసాగుతోంది. వీటిని అధికార పార్టీ నేతలు కాజేయాలని చూస్తున్నారని టీడీపీ నాయకులు అంటూంటే వాటిని కాపాడి తీరుతామని అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు అశోక్ గజపతిరాజు కూడా చెబుతున్నారు.ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నడూ లేనిది మాన్సాస్ ట్రస్ట్ భూముల విషయంలో ఎందుకు ఇత రచ్చ సాగుతోంది అన్నదే చర్చగా ఉంది. విశాఖకు రాజధానిని తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వ భూముల కొరత బాగా ఉంది. దాంతో ఒక వైపు భూ ఆక్రమణల మీద ఉక్కు పాదం మోపుతూనే మరో వైపు అవసరమైన భూములను వేరే మార్గాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం అనుకుంటోందని చెబుతున్నారు. సింహాచలం భూములు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు కూడా ట్రస్ట్ నిర్వాహకులను వేరే చోట భూములను ఇవ్వడమో లేక ప్రజోపయోగం కోసమే కొన్ని భూములు తీసుకున్నారని చెబుతారు. ఇపుడు వైసీపీ కూడా అలా చేయాలనుకున్నా కుదిరే వ్యవహారం మాత్రం కాదు, ఎందుకంటే అక్కడ అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆయన రాజకీయంగా బద్ధ విరోధి పార్టీకి చెందిన నాయకుడు. దాంతో పాటు వైసీపీ నేతల దూకుడు వల్ల కూడా సాఫీగా జరగాల్సిన వ్యవహారం ఏదైనా ఉంటే అది రచ్చగా మారుతోంది అంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రాలో భూ ప్రకంపనలు కొనసాగడమే తప్ప ఇప్పట్లో ఆగేది లేదన్నది నిజం.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Vijayanagaram Fort
King vs. Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page