సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

0 7

వరంగల్  ముచ్చట్లు:
ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.  శనివారం నాడు  స్థానిక ఆర్ ఎండ్ బి  గెస్ట్ హౌస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ,ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్దన్నపేట ,వరంగల్ తూర్పు శాసనసభ్యులు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 21 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ 21వ తేదీనాడు ఉదయం 10:30  గంటలకు సూపర్  స్పెషాలిటీ హాస్పిటల్ కు   భూమి పూజ, ఉదయం 11 గంటలకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం,11: 45 గంటలకు  నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలో పాల్గొంటారని షెడ్యూల్ ను వివరించారు.అనంతరం యాదాద్రి కి బయలుదేరి వెళ్లనున్నారని అన్నారు.  రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా వున్నారని తెలిపారు.  లోక్డౌన్ ఉన్న కూడా ఏ రాష్ట్రంలో లేని విదంగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు.  ప్రైవేట్ హాస్పిటల్ ల కన్నా ఎంజీఎం లో మెరుగైన సేవలు అందించామని,వైద్య పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరంగలో లో నూతనంగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా  56 ఎకరాల 30 గుంటల్లో నిర్మిస్తున్నామని, 30 అంతస్తులతో  అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని అయన  తెలిపారు. జిల్లా లో జరుగుతున్న అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.  వరంగల్,  అర్బన్ రూరల్ జిల్లా లను వరంగల్, హన్మకొండ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే పేర్లతో కొనసాగించేందుకు  వీలుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

- Advertisement -

Tags:Arrangements for the CM’s visit are complete
Minister Errabelli Dayakar Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page