సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కరించాలి  -టాస్కా రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు

0 17

జగిత్యాల  ముచ్చట్లు:

సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.నర్సింహారావు ప్రభుత్వాన్ని కోరారు.శనివారం హైదరాబాద్ లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గూగుల్ మీట్ ద్వారా జరిగిందని, ఆ సమావేశంలో తీర్మానాలను ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. శనివారం  సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
“ప్రపంచ వయోదికుల వేదింపుల అవగాహన రోజు”న  జరిగిన సమావేశంలో ఆమోదించి ప్రభుత్వం నకు సమర్పించిన ప్రతి పాదనలను సీనియర్ సిటిజెన్స్ సమాచారం కోసం వివరించారు.
1.50 లక్షల వయోధికుల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి పర్యవేక్షించుటకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వయోధికుల సంక్షేమ శాఖ సంచాలకుల  కార్యాలయంలో కనీసం ఒక  సూపేరెండేంట్ ,సీనియర్ అసిస్టెంట్లతో ప్రత్యేక మైన సెక్షన్ తక్షణమే ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.
2.తల్లి తండ్రులు వయోదికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007″లోని ముఖ్యాంశ ములను సూచించే సూచిక బోర్డులను గ్రామ పంచాయతీ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా కలెక్టర్ మరియు అన్ని పోలీసు స్టేషన్ లలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.చట్టంలోని అంశాలు వయోధికులకు మరియు యువతకు తెలుస్తాయి. అలాగే చట్టంను అమలు పరచ వలసిన అధికారుల బాధ్యతను వారికి గుర్తు చేస్తుంది.
3. రాష్ట్రం లోని అన్ని గ్రామాల్లో వయోదికులకు మరియు యువతకు “తల్లితండ్రులు,వయోదికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007” లోని అంశాలను తెలియ చేయుటకు అవగాహన సమావేశములను ఏర్పాటు చేయుటకు టాస్కాకు ప్రభుత్వం సహకరించాలి.
4. మండల కేంద్రాల్లో వయోధికులకు, పిల్లలకు కౌన్సిలింగ్ చేసి వారి మధ్య తలెత్తిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుటకు కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీటిలో వయేధికుల ప్రతినిధులు,తహశీల్దార్, ఎంపీడీవో, పోలీసు స్టేషన్ల అధికారులు సభ్యులుగా ఉండాలి. ప్రభుత్వ సహకారంతో టాస్క వీటిని నిర్వహించగలదు.
5. మెంటేనేన్స్ ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ నిర్ణీత కాల పరిమితిలో తీర్పులను చెప్పుటకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు తక్షణమే యివ్వాలి.
6. సెక్షన్ 21 ప్రకారం పోలీసులు తమ పరిధిలో
కల వయోధికుల ఆస్తులు ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం పోలీసు శాఖకు ఆదేశాలను ఇవ్వాలి.
7. ప్రతి జిల్లాలో పేద మరియు ఏఆధారం లేని వృద్దులకోసం ప్రతి జిల్లాలో ఒక వృద్దాశ్రమును ప్రభుత్వం ఏర్పాటు చేయవలెను.వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించక ప్రభుత్వమే నిర్వహించాలి.
8. సెక్షను 20 ప్రకారం వయోధికులకు అన్ని రకాల జబ్బులకు ఉచిత వైద్య సేవలు అందించుటకు అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వ గ్రాంటు పొందు తున్న ప్రయివేటు ఆసుపత్రులలో సరిపడ పడకలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలను ఇవ్వాలి.
9. అన్ని బ్యాంకులు, రైల్వే/బస్ స్టేషన్లలలో వయోధికులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.
10. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వయోధికులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శన ఏర్పాట్లు చేయాలి.
11. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రములో వయోధికుల
మానసిక ఉల్లాస కేంద్రాలను (సీనియర్ సిటిజెన్స్ డే కేర్ సెంటర్స్) ఏర్పాటు చేయాలి.
12.వయోధికులందరికి
రాష్ట్రం లోని అన్ని రకాల పార్కులలో, ప్రభుత్వ మైదానములలో ఉచితంగా వాకింగ్ ,వ్యాయామాలకు అనుమతి ఇస్తూ
ప్రభుత్వం ఆదేశాలివ్వాలి

- Advertisement -

13. రాష్ట్రం లోని వయోధికులందరికి నెలలో కనీసం ఒకసారి ప్రాధమిక వైద్య సేవలను వారి గృహ సముదాయముల దగ్గర సంచార మొబైల్ వ్యానుల ద్వారా అందించుటకు వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలను ఇవ్వాలి.104 సర్వీసుల ద్వారా వీరికి వైద్య సేవలు అందించవచ్చు.
14. ప్రతి గ్రామ, మండల, పట్టణాలలో సీనియర్ సిటిజెన్స్ భవనాలను నిర్మించుటకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.ప్రతి మున్సిపాలిటీ,గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సీనియర్ సిటిజెన్స్ డే కేర్ సెంటర్లు నిర్మించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కువినతి పత్రం ఇవ్వడానికి  తీర్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావ్,కోశాధికారి కుమార స్వామి,రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్,నాయకులు కృష్ణా రెడ్డి,వెంకటయ్య, భారత్ ధూబే,నరేంద్ర,నర్సయ్య, ప్రతాప్ రెడ్డి,మార్థ సత్యనారాయణ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

 

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Senior Citizens issues need to be addressed
-Tasca State President P. Narsimha Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page