డ్రోన్లతో మందుల సరఫరా

0 21

రేపు కర్ణాటకలో ప్రయోగాత్మకంగా ప్రారంభం

 

చిక్కబళ్లాపుర ముచ్చట్లు:

 

 

- Advertisement -

కంటికి కనిపించనంత దూరంలో ప్రయాణించే విధానంలో.. డ్రోన్‌ల ద్వారా ఔషధాల సరఫరాను దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. బెంగళూరుకు 80 కి.మీ.ల దూరంలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్‌లో ఈనెల 21న అధికారికంగా దీనికి శ్రీకారం చుడుతున్నారు. నారాయణ హెల్త్‌కేర్‌ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్‌ నిర్వహణ కంపెనీ టీఏఎస్‌ దీనికి నేతృత్వం వహిస్తోంది. ఇందుకు గాను మందులను గగన మార్గంలో తరలించేందుకు తగిన రెండు డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో మెడ్‌ కాప్టర్‌గా పిలిచే ఓ డ్రోన్‌కు కేజీ బరువున్న ఔషధాలను 15 కి.మీ.ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ర్యాండింట్‌ అనే మరో డ్రోన్‌ 2 కేజీల బరువును 12 కి.మీ.లు తీసుకెళ్లగలుగుతుంది. ఈ రెండింటినీ 30-45 రోజల పాటు పరిశీలించనున్నారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రయోగం ద్వారా పరిశీలించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడతారు. డ్రోన్ల ద్వారా మందుల సరఫరాను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు తాము అనుమతి పొందామని.. 100 గంటలు పరిశీలించిన అనంతరం పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)కు నివేదిక సమర్పిస్తామని టీఏఎస్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గౌరిబిదనూర్‌లోని గగనతలంలో 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రయోగాలు జరుగుతాయని.. ఈమేరకు లాంఛనంగా అనుమతి పొందినట్లు వెల్లడించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Supply of drugs with drones

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page