తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

0 10

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా తెప్పోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవమూర్తులకు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో రుక్మిణి స‌త్య‌భావ స‌మేత శ్రీ కృష్ణస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి, జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్  మ‌ల్లీశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Theppotsavalu begins at Sri Padmavati Ammavari Temple, Thiruchanur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page