ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరం బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్

0 14

వర్ధన్నపేట  ముచ్చట్లు:

నిరంతరం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతో దోహదపడుతుందని బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అన్నారు.సోమవారం మండలంలోని ఇల్లంద గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షులు,వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్,జాతీయ బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు, కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లనే డిసెంబర్ 21 వ తేది 2014 న 193 సభ్య దేశాలు గల ఐక్యరాజ్య సమితి జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించుటకు అంగీకారం తెలిపిందన్నారు.కరోనా మహమ్మారి వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి,వైరస్ బారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి యోగా దోహదపడుతుందనే ఈ విషయాన్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా చాలామంది యోగా సాధకులు తెలియజేస్తున్నారని స్పష్టం చేశారు.

 

- Advertisement -

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి,ఈ కార్యక్రమంలో సముచిత సంఖ్యలో ప్రజలు పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు.ఇదే రోజున హిందూ హృదయ సామ్రాట్ శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవం కూడా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు.యోగా శిక్షకులు సుల్తాన్ రాజు పర్యవేక్షణలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాంపల్లి యాకయ్య,మండల ఇంచార్జ్,జిల్లా ఉపాధ్యక్షులు కుసుమ ఏకాంబరం,జిల్లా కార్యదర్శి కుందూరు మహేందర్ రెడ్డి,జిల్లా ప్రచార కార్యదర్శి పిట్టల రాజు, గ్రామ ఉప సర్పంచ్ మడ్డి రాజ్ కుమార్,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల రెడ్డి,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పోశాల సురేష్,మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి కృష్ణమూర్తి,జిల్లా ఉపాధ్యక్షురాలు అంగడి రజిత,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కర్క సోమిరెడ్డి,మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు కత్తి వెంకన్న,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఇలసాగరం రవిందర్,గ్రామ పెద్దలు నర్సింహారెడ్డి,కారింగుల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Yoga is essential for good health
BJP district president Kondetti Sridhar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page