కలెక్టర్ కాళ్లు మొక్కడం తప్పు కొదండరాం

0 14

హైదరాబాద్      ముచ్చట్లు:
ప్రజల ప్రతినిధిగా ఉండే కలెక్టర్ స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం ప్రజాస్వామ్య సంప్రదాయ కాదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రో.కోదండరాం విమర్శించారు. ప్రో.జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…  రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్లపై ఎలా మొకరిల్లుతారని ఆయన ప్రశ్నించారు. భావిషత్తు లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించమన్నారు. ప్రో.జయశంకర్ ఇచ్చిన స్పూర్తితో ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అన్నారు. సమాజం కోసం నిలబడిన వ్యక్తులను ఆదరించడం తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత అని… అందుకోసమే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ప్రో.జయ శంకర్ పై ప్రేమ చూపించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మార్గదర్శకుడు లాగా ముందుండి ఉద్యమకారులను నడిపించడాని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

- Advertisement -

Tags:Let’s not get it wrong to plant collector legs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page