గూడ అంజయ్య పాట తెలంగాణ భావజాల వ్యాప్తికి స్పూర్తి దాయకం: కేసీఆర్

0 16

హైద‌రాబాద్ ముచ్చట్లు:

ప్రముఖ గేయ కవి, కథా రచయిత గూడ అంజ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంజ‌య్య సేవ‌ల‌ను సీఎం కేసీఆర్ స్మ‌రించుకున్నారు. సబ్బండ వర్గాల జీవన తాత్వికతకు, సాంస్కృతిక చైతన్యానికి గూడ అంజయ్య పాట చిరునామాగా నిలిచిందని సీఎం అన్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి, పాట ద్వారా దివంగత గూడ అంజయ్య చేసిన ఉద్యమ కృషిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే గూడ అంజయ్య ఆశయాలను, తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తున్నదని సీఎం తెలిపారు. ఆ దిశగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నదని, తద్వారా గూడ అంజయ్యకు ఘన నివాళి అర్పిస్తున్నామని, సీఎం పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Gooda Anjayya song inspires the spread of Telangana ideology: KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page