నకిలీ విత్తనాలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం

0 18

311 క్రిమినల్ కేసులు..446 మంది అరెస్టు
మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్    ముచ్చట్లు:
నకిలీ విత్తనాలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.ఇప్పటివరకు 311 క్రిమినల్ కేసులు..446 మంది అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.నిత్యావసరాల సరుకుల చట్టంలోని సెక్షన్ 6(ఎ) కింద 3 కేసులు .. పదే పదే నేరాలు చేస్తున్న ఏడు మందిపై పీడి యాక్ట్ కింద జైలుకు పంపడం జరిగిందన్నారు.- నేరాల మూలాలన్ని గుంటూరు, కర్నూలు, రాయచూరు, మహారాష్ట్ర, గుజరాత్ లలోనే ఉన్నాయన్నారు.- మిరప, పత్తి విత్తనాలలోనే నకిలీ చీడ అధికమన్నారు.- అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలు అమ్ముతున్న డీలర్ల లైసెన్సులు  రద్దు చేశామన్నారు.- ఖమ్మంలో అనుమతిలేని మిరప విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు డీలర్లు, ఆదిలాబాద్ లో ధరల లేబుళ్లను మార్చి అమ్ముతున్న ఇద్దరి డీలర్ల లెసెన్సులు రద్దు చేశామన్నారు.- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.6.18 కోట్ల విలువైన 949 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్, రూ.70.9 కోట్ల విలువైన 20,561 క్వింటాళ్ల  పత్తి , మిరప మరియు ఇతర విత్తనాల అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.- తదుపరి చర్యలు, నాణ్యత పరీశీలనకు విత్తన నమూనాలను పరీక్షాకేంద్రాలకు తరలించామని,- పత్తి, మిరప కాకుండా రూ.9.83 కోట్ల విలువైన 5724 క్వింటాళ్ల ఇతర విత్తనాల అమ్మకాలు నిలిపివేసినట్లు తెలిపారు.- విత్తన, పురుగుమందులు, ఎరువుల చట్టాలలో ఉన్న లొసుగులను గుర్తించి నకిలీ విత్తనాలు,  నకిలీ పురుగుమందులు, నకిలీ ఎరువులను అరికట్టేందుకు 2017 నుండి వీటిని పీడీ చట్టం పరిధి కిందకు తీసుకువచ్చినామన్నారు. 2017 నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులపై 32 పీడీ యాక్ట్ కేసులు- దేశంలో నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.- ఈ సీజన్‌లో నిషేధిత హెచ్ టీ కాటన్ నిరోధించే క్రమంలో 59 ప్రాంతాలలో విత్తన నమూనాలు స్వీకరించి హెచ్ టీ కాటన్ ఉన్నట్లు తేలిన నలుగురిపై చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.- భవిష్యత్ లో నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా ముందస్తు ప్రణాళికతో వచ్చే సీజన్ లో ఫిబ్రవరి నుండే విత్తన ఉత్పత్తి సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన ఉత్పత్తిదారులపై నిఘా ఉంచినట్లు చెప్పారు.- తెలంగాణను నకిలీ విత్తనాలు లేని  రాష్ట్రంగా మార్చడమే లక్ష్య మన్నారు.-  ఎంతో ఉన్నతలక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేయూతనిస్తుంటే అమాయకులైన రైతులను మోసం చేస్తున్న కొందరు అక్రమార్కుల మూలంగా ఆరుగాలం కష్టపడిన రైతుల శ్రమ వృధా అవుతుందని,- రైతులను మోసం చేసే వారు ఎంతటి వారైన ఉపేక్షించమని హెచ్చరించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

- Advertisement -

Tags:The Telangana government has a strong foothold on counterfeit seeds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page