నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలి

0 8

ఏలూరు ముచ్చట్లు:

 

 

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఐ.ఎఫ్.టి.యు.అనుబంధ ఎ.పి. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరోనా బాధిత  కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు నెలకు పది వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా  ఐ.ఎఫ్.టి.యు. పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు,ఎం.పి.ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం పెదవేగి మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గంగరాజు లు  మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు పరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను బేషరతుగా రద్దు చేయాలనీ,కోవిద్ థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని అన్ని మండల కేంద్రాలలో 50 పడకల జర్మనీ తరహా కోవిద్ సెంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా వేయాలనీ, కోవిడ్ మందుల ఉచితంగా ఇవ్వాలనీ, మందుల ఉత్పత్తుల,అమ్మకాలపైన జిఎస్టి ని రద్దు చేయాలని కోరారు.  22 డిమాండ్లతో కూడిన మెమోరాండం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరుగుతుందన్నారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రజా, కార్మిక కర్షక ,నిర్మాణ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో ఆర్ రవి,పాలూరి రాట్నాలు, చిట్టూరి కొండబాబు,జక్కా రాజేష్,ఆర్, అండ్ బి రమేష్,కె అప్పారావు,జి నాగరాజు, ఆర్ బాబూలాల్, జి నాగరాజు, పి జోజి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Support construction workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page