పక్కా ఇళ్లకు శంకుస్థాపనలు

0 11

ఏలూరుముచ్చట్లు:

 

 

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పలు గ్రామాలైన ఆచంట ,కొడమంచిలి తదితర గ్రామాల్లో జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ళు నిర్మించుకునేందుకు  లబ్ధిదారులు శంకుస్థాపనలు చేసారు. లబ్దిదారులందరూ పూజా కార్యక్రమాలు మరియు సర్వమత ప్రార్ధనలతో శంకుస్థాపనలు  ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమంలో కొడమంచిలి గ్రామ సర్పంచి సుంకర సీతారాం మాట్లాడుతూ ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటల 18 నిమిషాలకు మంచి ముహూర్తం కావడంతో చాలా మంది లబ్ధిదారులు ఎంతో ఆనందోత్సాహాలతో శంకుస్థాపనలు చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాల మేరకు ఈ గ్రామంలో సుమారు 300 మందికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మంత్రి  చేతుల మీదగా ప్రారంభించి వైయస్సార్ జగనన్న కాలనీగా నామకరణం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొందని రంగరాజు   నాయకత్వంలో పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని సర్పంచ్ సుంకర సీతారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సుంకర ఇందిర ఆచంట సర్పంచి కోట సరోజిని, వెంకటేశ్వర రావు, వైట్ల కిషోర్ , మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Concreting for pucca houses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page