పుంగనూరులో జగనన్న కాలనీ నిర్మాణాలు వేగవంతం చేయాలి – జేసి వెంకటేశ్వర్లు

0 49

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలలో గృహానిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని జేసి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పట్టణ సమీపంలోని నక్కబండలో నిర్మిస్తున్న పనులను పరిశీలించారు. అలాగే లబ్ధిదారులతో నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న జగనన్న కాలనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని , ఈ కాలనీలలో నిర్మాణాలు అత్యంత సుందరంగా నిర్మించి , సత్వరం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క మిషనర్‌ కెఎల్‌.వర్మ, హౌసింగ్‌ డీఈఈ నరసింహాచారి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Construction should be expedited in Jagannath colonies in Punganur – Jesse Venkateshwarlu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page