ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నిజాయితీలతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి – జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్

0 12

కర్నూలు   ముచ్చట్లు:

కారుణ్య నియామకం కింద 6 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాలు  జిల్లా కలెక్టర్ జీ వీరపాండ్యన్ అందజేసారు..
ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్ హితవు పలికారు.  జిల్లాలో కారుణ్య నియామకం కింద 6 మంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్ సోమవారం మధ్యాహ్నం తన ఛాంబర్ లో నియామక ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.
వీరిలో షోయబ్ అస్లాం హుస్సేన్, వహీద్ ఖాన్ అబ్దుల్, తరుణ్ కుమార్, జి గులాబి నలుగురికి కర్నూలు కలెక్టరేట్ లోని రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పోస్టింగ్ ఆర్డర్ అందజేశారు. అలాగే పీ సందీప్ ఆదోని డివిజన్ పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, ఎం దినేష్ కుమార్ ఆదోని డివిజన్ గోనెగండ్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం, అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పుల్లయ్య, ఏఓ జి. వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

 

Tags:Those who join government jobs should work honestly and make a good name for themselves
– District Collector Veerapandian

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page