మంచు వర్సెస్ కంచు-రసవత్తరంగా మా ఎన్నికలు

0 18

హైదరాబాద్ ముచ్చట్లు:

 

టాలీవుడ్‌కు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ (మా) ఎన్నికలు ఎంతటి వివాదాలకు దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన మా ఎన్నికలు, నరేష్ ప్యానెల్-శివాజీ రాజా ప్యానెల్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, మీడియా ముందు చేసిన వీరంగం అందరూ చూశారు. అలా చివరకు నరేష్ ప్యానెల్ గెలిచింది. అయితే గెలిచిన ప్యానెల్‌లోనే మనస్పర్థలు తలెత్తడంతో ఎన్నో వివాదాలు బయటకు వచ్చాయి. మా అధ్యక్షుడు నరేష్, జీవిత, రాజశేఖర్ మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అయితే ఇప్పుడు నరేష్ పదవీకాలం ముగుస్తోంది. ఈక్రమంలో మళ్లీమా ఎన్నికలు తెరపైకి వచ్చాయి.అయితే ఈ ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయదలుచుకున్నట్లు ప్రకటించారు. పైగా ఇప్పటికే పలు టీవీ ఛానల్స్‌లో ఆయన ఇంటర్వ్యూ లు ఇస్తూ, తనకు ఈసారి ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. పైగా రాజకీయపరంగా బీజేపీకి వ్యతిరేక గళం బలంగా వినిపించే ప్రకాష్ రాజ్‌కి టీఆర్ఎస్ అండదండలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది.ప్రకాష్ రాజ్‌కి వ్యతిరేకంగా హీరో మంచు విష్ణు కూడా ఈ సారి ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహ పడుతున్నాడు అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మంచు విష్ణు బరిలోకి దిగితే మోహన్ బాబు కుటుంబం అండదండల కారణంగా సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంచు విష్ణుకు నరేష్ పూర్తి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోసం మంచు విష్ణు, మోహన్ బాబు కూడా పావులు కదుపుతున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు.. కృష్ణ నివాసానికి వెళ్లారు. అయితే ఇప్పుడు మళ్లీ మెగా వర్సెస్ మంచు వ్యవహారంలా ఈ ఎన్నికలు మారేట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం గతంలో కంటే రసవత్తరంగా మారేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టు కనిపిస్తోంది.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Snow vs. bronze-juicy our election

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page