వరంగల్ లో ఎయిర్ పోర్టు

0 10

వరంగల్ ముచ్చట్లు:
వ‌రంగ‌ల్ న‌గ‌రం గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇవాళ భూమి పూజ చేసిన మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ఏడాదిన్న‌ర లోపు పూర్తి కావాలి. ఈ విష‌యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియ‌స్‌గా ప‌ని చేయాల‌న్నారు.వ‌రంగ‌ల్ క‌చ్చితంగా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం కావాలి. గొప్ప విద్యాకేంద్రం, వైద్య కేంద్రం కావాలి. తూర్పు తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్ట‌ర్ కావాలి. ప్ర‌పంచంలో అత్యంత అధునాత‌న వైద్య స‌దుపాయాలు కెన‌డాలో ఉన్నాయ‌ని తెలిసింది. వైద్య‌శాఖ అధికారుల‌తో క‌లిసి కెన‌డాను విజిట్ చేసి.. వీడియోలు, ఫోటోలు చిత్రీక‌రించండి. కెన‌డాను త‌ల‌ద‌న్నేలా ఆస్ప‌త్రి నిర్మాణం ఉండాలి. అన్ని వైద్య సేవ‌లు ఒకే ప్రాంగ‌ణంలో రావాలి. మ‌హిళ‌లు ప్ర‌స‌విస్తేనే మ‌నంద‌రం పుట్టాం. మాతాశిశు సంర‌క్ష‌ణ చాలా ప్రాధాన్య‌మైన అంశం. తెలంగాణ మొత్తం నాగ‌రికంగా మారాలి. ప్ర‌తి పాత తాలుకా సెంట‌ర్‌లో మాతాశిశు సంర‌క్ష‌ణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నిలోఫ‌ర్ సెంట‌ర్ రావాలి. వ‌రంగ‌ల్‌కు డెంట‌ల్ కాలేజీ, డెంట‌ల్ హాస్పిట‌ల్ మంజూరు చేస్తున్నాం. హైద‌రాబాద్ వాళ్లు కూడా ఇక్క‌డికే వ‌చ్చేలా విద్య‌, వైద్య స‌దుపాయాలు క‌ల్పించాలి. త్వ‌ర‌లోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతుంది. వ‌రంగ‌ల్‌లో మంచినీళ్ల గోస లేదు. వ‌రంగ‌ల్లో పెట్టుబ‌డులు రావాలి. ఐటీ కంపెనీల‌ను విస్త‌రించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇక హనుమకొండ జిల్లా
వరంగల్, జూన్ 21, (న్యూస్ పల్స్)
వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతామ‌ని సీఎం పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇవాళ ప్రారంభించుకున్న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని హ‌న్మ‌కొండ జిల్లాగా ప‌రిగ‌ణించాలి. దీనికి స‌మీపంలో నిర్మించ‌బోయే క‌లెక్ట‌రేట్‌ను వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా ప‌రిగ‌ణించాలి. పేరు మార్పున‌కు సంబంధించిన ఉత్త‌ర్వులు రెండు, మూడు రోజుల్లోనే వ‌స్తాయ‌ని సీఎం తెలిపారు.అధునాత‌న జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌న‌వాన్ని ప్రారంభించుకోవ‌డం ఆనందంగా ఉంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌రంగ‌ల్ నాయ‌కులు, ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు బాగా తెచ్చుకున్నాం. అవ‌న్నీ ప‌రిపుష్టం కావాలి. అప్పుడే అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. ప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌న‌ప్పుడే నిజ‌మైన ప‌రిపాల‌న అని అన్నారు. ప‌నులు వేగంగా జ‌రిగితేనే ప్ర‌జాస్వామ్యం విజ‌య‌వంత‌మ‌వుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు.
వరంగల్ కు మంచి రోజు
వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు ఇవాళ సుదినం.. కేసీఆర్ మ‌న‌కు సీఎం కావ‌డం మ‌నం ఒక అదృష్టంగా భావించాలి అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడారు. వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జ‌ల మ‌న‌సులో ఏముందో సీఎం కేసీఆర్‌కు తెలుసు. ఈ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌హారాష్ర్ట‌లో అక్ర‌మ ప్రాజెక్టులు క‌ట్టి వ‌రంగ‌ల్ జిల్లాకు రావు అనుకున్నాం. కానీ కాళేశ్వ‌రం ద్వారా దేవాదుల‌కు సాగునీరు అందిస్తున్నారు. రైతుల త‌ర‌పున పాదాభివంద‌నం చేస్తున్నాను. రైతుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. గ్రామాలు బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నారు. గ్రామాల రూపురేఖ‌లు మారిపోయాయి.సీఎం కేసీఆర్ ఆశ‌యాల మేర‌కు వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాన్ని తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్ ఎంజీఎంను అభివృద్ధి చేస్తున్నారు. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా మల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి భూమిపూజ చేయ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ఈ హాస్పిట‌ల్ పూర్త‌యితే స‌మీప జిల్లాల ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఒక‌ప్పుడు ఆఫీసుల చుట్టూ తిర‌గ‌లేక స‌చ్చేది. కానీ నేడు అన్ని కార్యాల‌యాలు ఒకే వ‌ద్ద నిర్మించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ద‌య‌చేసి వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చాల‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

- Advertisement -

Tags:Airport in Warangal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page