ఆక్రమణలో నాయుడుపేట  అన్నా  చెరువు

0 21

-నిద్రావస్థలో రెవెన్యూ,నీటిపారుదల శాఖాధికారులు

 

నెల్లూరు ముచ్చట్లు :

 

- Advertisement -

నెల్లూరు జిల్లా,నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు  అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ పంచాయతీ గా ఉన్న నాయుడుపేట  మున్సిపాలిటీ, రెవెన్యూ కేంద్రంగా రూపాంతరం చెందడం తోపాటు నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు లో సెజ్ ఏర్పాటు కావడంతో, ఈ ప్రాంతంలో భూముల ధరలకు అమాంతంగా రెక్కలొచ్చాయి.దీనితో ధనార్జనే ద్యేయంగా ఎంచుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములు,చెరువులు, కాలువలు,రోడ్డు మార్జిన్ లను సైతం ఆక్రమించి ఇళ్ల ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.రెవెన్యూ డివిజన్ కేంద్రానికి కూతవేటు దూరంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, సంబంధిత అధికారులకు చీమ కుట్టినట్టైనా ఉండడం లేదన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీ పరిదిలో పట్టణ నలుదిశలా  అక్రమ లేఅవుట్ లు వెలసివున్నాయి.నాయుడుపేట పట్టణ ప్రాంతంలో అంకణం లక్ష రూపాయలు పలుకుతుంది. దీనితో కొందరు రియల్టర్ లు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను తమ స్థలాల్లో కలిపేసుకుని అక్రమించుకుంటున్నారు.

 

 

 

 

 

చివరకు నాయుడుపేట మున్సిపాలిటీ వారు ప్రజాప్రయోజనాలకు కేటాయించిన  ,10.5 ఎకరాల అన్న చెరువు  సైతం రియల్టర్ లకబంధ హస్తాల్లోకి వెళ్ళింది. అన్నాచెరువు ప్రాంతం లో కొంత మేర పట్టా పొలాలను కొని  ఇళ్ల ప్లాట్లు ఏర్పాటు చేస్తున్న రియలటర్లు కొందరు అన్నాచెరువును అక్రమిస్తున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపివడం లో ఆంతర్యం ఏమిటో ఆ ఏడుకొండల వాడికే తెలియాలి. గత 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పదిన్నర ఎకరాల అన్నాచెరువు ను పేదలకు ఇళ్ళు స్థలాలు ఇవ్వడం కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి, చదును చేయించారు.కొన్ని రాజకీయ అనివార్య కారణాలతో పేదల ఇళ్లస్థలాల పంపిణీ ఆగిపోయింది.దీనితో ఆ చెరువు చుట్టూ పక్క రైతులు కొందరు చెరువు స్థలాన్ని కొంత అక్రమించుకొన్నారు.ప్రస్తుతం  రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు గా జరుగుతున్న నేపథ్యంలో  అన్నా చెరువు భూములు పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి.

 

 

 

 

సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య  నాయుడుపేట మున్సిపాలిటీ ని ఆదర్శంగాతీర్చిదిద్దే క్రమంలో అన్నాచెరువు భూములను నాయుడుపేట మున్సిపాలిటీ కి ప్రజాప్రయోజనాల కోసం కేటాయించారని తెలిసింది. చెరువుకు సంబంధించిన 10.5 ఎకరాల స్థలంలో  చెత్త నుండి సంపద కేంద్రం నిర్మించడానికి రూ 56 లక్షలు నిధులు మంజూరైనట్లు తెలిసింది. టెండర్లు నిర్వహించిన ట్లు తెలిసింది. భవిష్యత్తులో  అన్నాచెరువు భూముల్లో మున్సిపాలిటీ వారు ఆధునిక పార్క్,వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.ఇంతటి ప్రాధాన్యం గల కోట్లాది రూపాయల విలువ చేసే అన్నాచెరువు భూముల ను రియలటర్లు, ఆక్రమణ దారుల చేరనుండి విడిపించి, నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సబంధిత అధికారులు సహకరిస్తారో రియల్టర్ లకు కొమ్ముకాస్తారో వేసి చూడాల్సిందే.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Naidupet Anna pond under occupation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page