ఆరు లక్షలా..కరెంటు బిల్లు..

0 11

మంచిర్యాల ముచ్చట్లు :
లక్షల రూపాయల్లో విద్యుత్తు బిల్లు రావడంతో  వినియోగదారుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణ గృహానికి వినియోగించే విద్యుత్తు మీటరుకు సంబంధించిన నెలవారీ బిల్లు రూ. 6,69,117 వచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్కు చెందిన ముప్పిడి మధురవాణి పేరుపై ఉన్న సర్వీసు నెంబరు 15215729కు గత మే నెల 10 నుంచి జూన్ నెల 21 వరకు ఉన్న 42 రోజులకు రూ.6.69 లక్షలు చెల్లించాలని సిబ్బంది వినియోగదారుడి చేతిలో బిల్లు పెట్టారు…దీనితో వినియోగదారుడు బిత్తర పోయారు… వినియోగదారుడికి లక్షల్లో బిల్లు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విద్యుత్తుశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధిత వ్యక్తి ఇంటికి సిబ్బందిని మరోసారి పంపించి బిల్లును సరిచేశారు. దీంతో రూ.6,69,117 కాస్త రూ.9764గా మారింది. 70188 యూనిట్లు.. 1218 అయింది. మీట నొక్కినప్పుడు యంత్రంలో సంఖ్య పడకపోవడంతో రెండుసార్లు నొక్కాల్సి వచ్చిందని, అందుకే ఈ సమస్య ఎదురైందని విద్యుత్తు సిబ్బంది తెలిపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

- Advertisement -

Tags:Six lakhs .. electricity bill ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page