ఎఫ్సీఐ వద్ద లారీ నిలిచి పోకుండా కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్

0 14

కామారెడ్డి  ముచ్చట్లు :

కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్లు బియ్యాన్ని లోడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, గోదాం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా లారీలు ఖాళీ చేయకుండా నిలిచి పోతున్నాయని కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ ఎ.శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నూతన కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు పూర్తయినందున  ఎఫ్సిఐ వద్ద లారీలు నిలిచి పోకుండా కాంట్రాక్టర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చేసి ఎఫ్ సి ఐ కి అప్పగించాలని పేర్కొన్నారు. ప్రతి గోదాం నుంచి 30 ఏసీకేలు అన్లోడింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో డిసిఎస్వో కొండల్ రావు, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Tags:The contractor must take action to prevent the truck from stopping at the FCI
District Collector Dr. A. Sarath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page