కంది,పెసర పంటలతో అధిక దిగుబడి సాధ్యం చెన్నారంలో రైతులకు ఉచిత విత్తనాలు పంపిణీ

0 5

వర్ధన్నపేట ముచ్చట్లు :

కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేస్తున్న కంది, పెసర విత్తనాలు అధిక దిగుబడిని ఇస్తాయని, రైతులు కంది పెసర పంటలను సాగు చేస్తే అధిక దిగుబడి సాధ్యం అవుతుందని కృషి విజ్ఞాన కేంద్రం సేంధ్య విభాగపు శాస్త్రవేత్త సౌమ్య తెలిపారు. మంగళవారం మండలంలోని చెన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్త సౌమ్య మాట్లాడుతూ డబ్ల్యుఆర్జి కంది,పెసర విత్తనాలు సాగు చేసేందుకు వరంగల్ పరిసర ప్రాంతాలు అనుకూలంగా వుంటాయని అన్నారు.160 రోజుల పంట కాలం కలిగి సుమారు ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఈ విత్తనాలు క్యుబేరియం ఎండ తెగులును తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయన్నారు.కంది పంటను సాగు చేసి అధిక దిగుబడి పొందడమే కాకుండా నేల సారాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అని అన్నారు.మండల వ్యవసాయ అధికారి రాం నర్సయ్య మాట్లాడుతూ డబ్ల్యుఆర్జి పెసర విత్తనాల పంట కాలం 60 రోజులేనని,ఒకేసారి పూతకు వస్తుందని రైతులు పెసర పంటను పండించి అధిక దిగుబడి పొందాలని సూచించారు.జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం వారు అందించే ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని  రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పప్పు దినుసు పంటలు రైతులకు అధిక లాభాన్ని చేకూరుస్తాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు,జడ్పీటీసీ మార్గం భిక్షపతి,సర్పంచ్ పోనుగోటి భాస్కర్ రావు,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, రైతుబంధు కో ఆర్డినేటర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:High yields are possible with sorghum and pesara crops
Distribution of free seeds to farmers in Chennaram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page