గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించాము

0 7

పత్తికొండ ముచ్చట్లు :

 

సొంత గ్రామాలను వదిలి ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వలస పోకుండా ఉండటం కోసం ఉపాధి పనులు కల్పించామని ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ఏపీఓ బజారు చెప్పారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా సమయానుకూలంగా పనులు కల్పించామని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉపాధి పనులకు బ్రేకులు పడవన్నారు. ఉపాధి కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పనులు లేని కూలీలకు పనులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు కూలీలకు ఎప్పటికప్పుడు పనులు మంజూరు చేస్తామని చెప్పారు. 10 మంది వచ్చి పనులు అడిగితే పరిశీలించి తగిన పనులను కల్పిస్తామన్నారు. ఉపాధి కోసం గ్రామాలను వదిలి దూర ప్రాంతాలకు వలస పోవాల్సిన అవసరం లేదన్నారు. వలస కూలీలకు పనులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉపాధి పనులను కూలీలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: We have provided employment to the laborers in the villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page