నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా అమ్మి రెడ్డి నియామకం

0 11

నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా గుంటూరు గ్రామీణ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అమ్మి రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గా పనిచేస్తున్న ఎస్పీ భాస్కర్ భూషణ్ కేంద్ర సర్వీసులకు బదిలీ కాబడ్డారు. ఈ క్రమంలో హలో నెల్లూరు జిల్లా ఎస్పీగా నియామకాలు జరిపేందుకు జిల్లాకు చెందిన మంత్రులు ప్రభుత్వంతో మంతనాలు జరిపారు. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా ఎస్పీ గా అమ్మి రెడ్డి నియామకం కావడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో అధికంగా ఇసుక మాఫియా జరుగుతున్న సమయంలో అమ్మి రెడ్డి జిల్లా ఎస్పీగా రావడం జరుగుతుంది. ఇసుక మాఫియా పై అమ్మి రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఇసుక మాఫియా తగ్గించే ప్రయత్నాలు ఎలా చేస్తారు అనేది సింహపురి ప్రజల్లో విమర్శనాత్మక ధోరణి లో ఉన్నారు. గత వారం పది రోజులుగా నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని గొల్ల కందుకూరు రీచ్ నుండి 10 రోజుల లో 500 కోట్ల ఇసుక మాఫియా జరిగినట్లు ఆధారాలతో టిడిపి నాయకులు నిరూపించబడింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కు జిల్లా టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లాకు ఎస్పీగా నియామకం కాబడిన అమ్మి రెడ్డి కి  ఇసుక మాఫియా తొలి చాలెంజ్ గా నిలవనుంది.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

- Advertisement -

Tags:Ammi Reddy has been appointed as the new SP of Nellore district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page