పుంగనూరులో వైఎస్‌ఆర్‌ చేయూతతో మహిళాభివృద్ధి-వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 84

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా మహిళాభివృద్ధి సాధ్యమౌతుందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. మంగళవారం మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులు 15,616 మందికి రూ.29.28 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో చైర్మన్‌ అలీమ్‌బాషా చేయూత ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని 2,330 మంది మహిళలకు రెండవ విడత ఆర్థిక సహాయం రూ.4.37 కోట్ల రూపాయలను జమచేయడం జరిగిందన్నారు. మహిళలు చేయూత నిధులను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైస్‌చైర్మన్‌ నాగేంద్ర,ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, ఐకెపి కోఆర్డినేటర్లు రవి, రవికుమార్‌, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Women Development-YSRCP State Secretary Peddireddy with YSR in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page