బంగాల వాసాలమర్రి

0 11

నల్గొండ  ముచ్చట్లు :

 

ఏడాది తిరిగే స‌రికి ప్ర‌స్తుత‌మున్న వాసాల‌మ‌ర్రి.. బంగారు వాసాల‌మ‌ర్రి కావాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు. వాసాల‌మ‌ర్రి గ్రామ సంద‌ర్శ‌న‌లో భాగంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు.కుల‌మతాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వాసాల‌మ‌ర్రి అభివృద్ధికి గ్రామ‌స్తులంతా ప్ర‌తిజ్ఞ చేయాలి. స‌మ‌స్య ఉంటే అంద‌రం క‌లిసి స‌మిష్టిగా పోరాడితే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. గ్రామంలో రెక్క‌ల క‌ష్టంపై బ‌తికేవాళ్ల‌కు అండ‌గా నిల‌వాల‌న్నారు. గ్రామ అవ‌స‌రాలు ఇక్క‌డ ల‌భించే వ‌న‌రుల ద్వారా తీర్చుకోవాలి. గ్రామ‌స్తులంతా 2 గంట‌లు ప‌ని చేస్తే అభివృద్ధి త‌ప్ప‌కుండా సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. వాసాల‌మ‌ర్రికి బ్ర‌హ్మాండ‌మైన క‌మ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్ల‌ను బాగు చేసుకుందాం. ఎవ‌రికి ఏం అవ‌స‌ర‌మున్నా మంజూరు చేసే బాధ్య‌త త‌న‌ది. అంద‌రూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.మూడు ద‌ళితవాడ‌ల‌కు వెళ్లి వాళ్ల‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తాను అని చెప్పారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాలి. ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల గురించి వివ‌రించే వాళ్లు ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో గ్రామ నిధి ఏర్పాటు చేసుకుని, క‌ష్ట‌మొచ్చిన వారికి అండ‌గా నిలిచే అవ‌కాశం ఉంటుంది. తొలుత గ్రామ అభివృద్ధి క‌మిటీ ఏర్పాటు చేయాల‌న్నారు. గ్రామ శ్ర‌మ‌దాన క‌మిటీ ఏర్పాటు చేసుకోవాలి.

- Advertisement -

ప‌రిశుభ్ర‌త‌, తాగునీరు క‌మిటీ, హ‌రిత‌హారం క‌మిటీ, వ్య‌వ‌సాయ క‌మిటీ ఏర్పాటు చేసుకోవాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.ఈ ఊరికి క‌నీసం తాను ఇంకో 20 సార్లు వ‌స్తాను. వ‌చ్చేసారి ఇలా స‌భ పెట్ట‌ను. మీ ఊరిలో న‌లుగురు మాత్ర‌మే ప‌రిచ‌యం అయ్యారు. అంద‌రూ ప‌రిచ‌యం అయ్యేలా స‌భ పెట్టాలి. అంద‌రం ప‌ట్టుబ‌డితే వాసాల‌మ‌ర్రి ఏడాది నాటికి బంగారు వాసాల‌మ‌ర్రి కావాలి. ఊరిలో పోలీసు కేసులు ఉండొద్దు. వెంట‌నే ప‌రిష్కారం చేసుకోవాలి. ఒక‌ర్ని చూస్తే మ‌రొక‌రు చిరున‌వ్వు న‌వ్వాలి. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకునే ప్రేమ ఏర్ప‌డాలి. గ్రామంలో ఐకమ‌త్యం, ప‌ట్టుద‌ల అవ‌స‌రం. క‌ష్టం, బాధ ఎవ‌రిదైనా ఒక‌టే అనే భావ‌న ఉండాలి. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్‌గా ఉంటుంది.. అన్ని ప‌నులు జ‌ర‌గాలి. ఇవ‌న్నీ సాధ్య‌మైతే వంద‌కు వంద శాతం వాసాల‌మ‌ర్రి బంగారంలా త‌యార‌వుతుంది.గ్రామ స‌ర్పంచ్, ఎంపీటీసీ నాయ‌క‌త్వంలో అద్భుత‌మైన ప‌ని జ‌ర‌గాలి. ఆకుల ఆగ‌మ్మ‌, చిన్నూరి ల‌క్ష్మీతో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. ఆగ‌మ్మ అల్ల నేరేడు పండ్లు ఇచ్చారు. అల్ల నేరేడు చెట్టు లేకుండా ఊరు ఉంట‌దా? ఇక అన్ని చెట్లు నాటాలి. ప్ర‌త్యేక‌మైన ప‌ని జ‌ర‌గాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక భోజ‌నం చేస్తున్న మ‌హిళ‌ల వ‌ద్ద‌కు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. భోజ‌నాలు ఎలా ఉన్నాయ‌ని అడిగారు. కేసీఆర్ ఒక సామాన్యుడిలా వారి వ‌ద్ద‌కు వెళ్లి ఆప్యాయంగా ప‌లుక‌రించ‌డంతో మ‌హిళ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజ‌న ఏర్పాట్లు చేశారు. వాసాల‌మ‌ర్రిలోని కోదండ రామాల‌యంలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. సాల‌మ‌ర్రి గ్రామాభివృద్ధికి ప్ర‌త్యేక అధికారిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున నియ‌మిస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌త్యేక అధికారి ఎవ‌రో కాదు.. జిల్లా క‌లెక్ట‌రే అని తెలిపారు. త‌ల్లైనా, తండ్రైనా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తినే. జిల్లా అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి క‌లెక్ట‌ర్ ప‌నులు చేయిస్తారు. గ్రామ అభివృద్ధికి నూరో, నూట యాభై కోట్లు ఇస్తాం. కానీ ఆ నిధులు వినియోగించాలి. అప్పుడే అభివృద్ధి జ‌రిగిన‌ట్టు. గ్రామంలో జ‌బ్బు ప‌డిన వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున ఉచితంగా వైద్యం అందిస్తామ‌న్నారు. గ్రామంలో అర్హులైన వారంద‌రికీ రేష‌న్ కార్డులు ఇస్తామ‌న్నారు. గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులు, ప‌ద‌వీ విర‌మ‌ణ ఉద్యోగులు క‌లిసి క‌మిటీల‌ను ఏర్పాటు చేసి.. అభివృద్ధికి స‌హ‌క‌రించాలి. చ‌దువుకోని వారికి చ‌దువుకున్న వారు స‌హ‌క‌రించాలి. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే క‌లెక్ట‌ర్ మీకు ఉన్నారు. ఆమె సేవ‌ల‌ను వినియోగించుకోవాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Bengal Vasalamarri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page