మత్స్యకారుల సంక్షేమానికి కృషి మంత్రి తలసాని

0 10

హైదరాబాద్ ముచ్చట్లు :
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్దికి, ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ని తెలంగాణా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ తో కలిసి మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇతర మత్స్య శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి రావడం, ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండటంతో మత్స్యకారుల జీవనోపాధి ఎంతో మెరుగుపడిందని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించే విషయం, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అనేక సమస్యల పరిష్కారానికి జులై 8 వ తేదీన గంగపుత్ర, ముదిరాజ్ సంఘ ప్రతినిధులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి కి తీసుకోవాల్సిన అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నూతన జిల్లాలు, నూతన గ్రామ పంచాయితీ లు ఏర్పడిన దృష్ట్యా వాటి ఆధారంగా నూతన మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మృతి చెందిన 116 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ క్రింద చెల్లించాల్సిన పెండింగ్ నిధులను త్వరలోనే విడుదల చేయడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గ్రామ పంచాయితీ చెరువుల లీజు అంశాన్ని, ఇతర అంశాలను రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కోరగా సమావేశంలో ప్రస్తావించగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మరణించిన మత్స్యకారులకు 6 లక్షల రూపాయలు ఇన్సురెన్స్ ను చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అందుకు అనుగుణంగా నూతన విధివిధానాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Talasani, Minister of Labor for the Welfare of Fishermen

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page