రూ.24.87 కోట్లు వైయస్సార్ చేయూత మంజూరు

0 24

పాడేరు శాసనసభ్యురాలు  కోట్టగుల్లి భాగ్యలక్ష్మి

విశాఖపట్నం  ముచ్చట్లు :
మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా పథకాలను సద్వినియోగం చేసుకొని చిన్నతరహా  పారిశ్రామికవేత్తలు గా ఎదగాలని పాడేరు శాసనసభ్యురాలు కోట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో రెండవ విడత వైయస్సార్ చేయూత పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గం పరిధిలోని 45 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఒక్కొక్కరికి 18,750 రూ.లు చొప్పున 13270 మందికి రూ24 కోట్ల 87 లక్షల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు జమ చేస్తారని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత ను సద్వినియోగం చేసుకొని మహిళలు చిన్న తరహా పరిశ్రమ వేతలుగా నిలవలని సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళ పక్షపాతి అని పథకలన్ని మహిళల పేరుమీదే మంజూరు చేస్తున్నారన్నారు. మన్యంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి హోటల్ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రాజెక్టు అధికారిని కోరారు. మహిళలకు వెలుగు ద్వారా ఆహార పదార్థాల తయారీ పై తగిన శిక్షణ అందించి ఫాస్ట్ ఫుడ్స్  సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.వన్ దన్ వికాస్ కేంద్రాల ద్వారా గిరిజన ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి గిరిజన ఉత్పత్తుల విక్రయాలు చేయాలన్నారు. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన బ్రాండ్లతో మార్కెటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. మన్యంలో సాగుచేస్తున్న వేరుశెనగ ను చక్కిళ్లు గా తయారు చేసే యూనిట్ నెలకొల్పాలని అన్నారు. ఆ తరువాత తయారుచేసిన చక్కిళ్లు ను అంగన్వాడీ, విద్యా సంస్థలకు సరఫరా చేయడానికి కృషి చేయాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి .
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని వైయస్సార్ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కొనుగోలు, చేయాలన్నారు. గిరిజన మహిళలు రాజకీయ సాధికారత సాధించారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రెండవ విడత చేయూత పథకాన్ని సొంత ఖర్చులకు వినియోగించకుండా వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి అన్నారు. అనంతరం లబ్ధిదారులకు రూ24 కోట్ల 87 లక్షల చెక్కును అతిధుల చేతులమీదుగా అందజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు గాయత్రీదేవి, స్థానిక సర్పంచ్ ఉషారాణి,ఎంపీడీవో నరసింహారావు, వెలుగు వి మురళి, కె నీలాచలం, కె అన్నపూర్ణ ,ఏ పీ ఓ కళావతి స్థానిక వైసీపీ నేతలు రమణమూర్తి, బుల్లిబాబు, రాంబాబు,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Rs.24.87 crore sanctioned by Vyassar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page