రోజూ భారీగా వ్యాక్సినేషన్ జరగాలి : రాహుల్

0 2

న్యూఢిల్లీ ముచ్చట్లు :

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ వ‌ర్చువ‌ల్‌గా మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మూడ‌వ వేవ్ వ‌స్తుంద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న శ్వేత‌ప‌త్రాన్ని రిలీజ్ చేశారు. థార్డ్ వేవ్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మై ఉండాల‌న్న అభిప్రాయాన్ని ఆయన వ్య‌క్తం చేశారు. కేంద్ర వ్యాక్సినేష‌న్ విధానాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన రాహుల్‌.. తాను రిలీజ్ చేసిన శ్వేత‌ప‌త్రం ఓ బ్లూ ప్రింట్ అని, థార్డ్ వేవ్‌కు ఎలా ప్రిపేర‌వ్వాలో చెబుతోంద‌న్నారు. రెండ‌వ వేవ్ స‌మ‌యంలో జ‌రిగిన లోపాలు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. థార్డ్ వేవ్ రావ‌డం ఖాయ‌మ‌ని, వైర‌స్ నిరంత‌రం పరివ‌ర్త‌న చెందుతోంద‌ని, తాను రిలీజ్ చేసిన శ్వేత‌ప‌త్రం ల‌క్ష్యం భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను సూచిస్తుంద‌ని, నిపుణుల‌తో చ‌ర్చించి నాలుగు విధానాల‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు రాహుల్ చెప్పారు.వ్యాక్సినేష‌న్ అనేది కీల‌క‌మైన పిల్ల‌ర్ అన్నారు. చాలా దూకుడుగా ఆ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని, వంద శాతం వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాలన్నారు. ప్ర‌భుత్వాలు ప్రిపేరై ఉండాల‌ని, హాస్పిట‌ళ్లు, ఆక్సిన్‌, మందుల‌తో సిద్దంగా ఉండాల‌ని రాహుల్ తెలిపారు. సెకండ్ వేవ్ స‌మ‌యంలో 90 శాతం మందిని ర‌క్షించుకునేవాళ్ల‌మ‌ని, కేవ‌లం ఆక్సిజ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ ఘోరం జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దేశంలో ఆక్సిజ‌న్ కొర‌త లేకున్నా.. ఎక్కువ సంఖ్య‌లో జ‌నం చ‌నిపోయిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోదీ క‌న్నీళ్లు ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేవ‌ని, కేవ‌లం ఆక్సిజ‌న్ మాత్ర‌మే ర‌క్షిస్తుంద‌న్నారు. ఇటీవ‌ల వార‌ణాసి హెల్త్ వ‌ర్క‌ర్ల‌తో మాట్లాడుతూ ప్ర‌ధాని మోదీ భావోద్వేగానికి లోనైన విష‌యం తెలిసిందే. బెంగాల్ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని మోదీ దృష్టి పెట్ట‌డం వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌లేద‌ని రాహుల్ ఆరోపించారు.సోమ‌వారం అత్య‌ధిక సంఖ్య‌లో వ్యాక్సిన్లు ఇవ్వ‌డం సంతోష‌క‌ర‌మ‌ని, కానీ ప్ర‌తి రోజు ఇలాగే జ‌ర‌గాల‌ని, జ‌నాభా మొత్తం వ్యాక్సిన్ వేయించుకునే వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ సాగాల‌న్నారు. ఫ‌స్ట్‌, సెకండ్ వేవ్‌లో ప్ర‌భుత్వ మేనేజ్మెంట్ దారుణంగా విఫ‌ల‌మైన‌ట్లు చెప్పారు. వైర‌స్ మ్యుటేట్ అవుత‌న్న కార‌ణంగా.. మునుముందు మ‌రిన్ని వేవ్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Vaccination should be done on a daily basis: Rahul

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page