వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు సంతోషకరం

0 28

ఏపీ, ఒడిశా… ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరం
గెజిట్‌ విడుదలకాగానే నేరడి నిర్మాణంపై దృష్టిపెట్టండి
అధికారులకు సీఎం ఆదేశం

అమరావతి ముచ్చట్లు :

- Advertisement -

వంశధారపై ట్రైబ్యునల్‌ తీర్పు పట్ల ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినటై్టందన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే వెంటనే నేరడి వద్ద వంశదారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈలోగా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసుకోవాలన్నారు. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా ఒడిశాకూ ప్రయోజకరమన్నారు. పొరుగు రాష్ట్రాలతో సంత్సంబంధాలు కోరుకుంటున్నామని, నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకూ మంచి జరుగుతుందన్నారు. నేరడి బ్యారేజ్‌ నిర్మాణం కోసం జరిగే శంఖుస్థాపన కార్యక్రమానికి ఒడిశా సీఎంతోపాటు, ఆరాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు. వివాదాలతో కాకుండా పరస్పర సహకారంతో ముందుకుసాగాలన్నదే తమ విధానమన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి… వంశధార ట్రైబ్యునల్‌తీర్పుపై మాట్లాడారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:The judgment of the Tribal Tribunal is pleasing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page