విద్యా వాలంటీర్ల అందోళన

0 9

హైదరాబాద్  ముచ్చట్లు :
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసి  14 నెలల బకాయి వేతనాలను వెంటనే  చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యావాలంటీర్లపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షతను నిరసిస్తూ  హైదరాబాద్ బషీర్ బాగ్ లోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని విద్యావాలంటీర్లతో కలిసి కృష్ణయ్య ముట్టడించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లకుండా విద్యాశాఖ అధికారులు మొండి వైఖరి వహిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 2 లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులకు నెలకు రెండు 2వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లుగానే… 16 వేల విద్యా వాలంటీర్లకు కూడా సర్కారు సాయం చేయాలని డిమాండ్ చేశారు.
14 నెలలుగా జీతాలు చెల్లించలేదని… ఇప్పటికైనా విద్యావాలంటీర్ల కష్టలను ముఖ్యమంత్రి గుర్తించి వారిని ఆదుకోవాలని కృష్మయ్య కోరారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని… కొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆయన తెలిపారు. తక్షణమే విద్యావాలంటీర్ల సమస్యను పరిష్కరించాలని… లేనిపక్షంలో… ముఖ్యమంత్రి దిగివచ్చేలా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ప్రతి ఏడాది రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలకాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -

Tags:Concern of academic volunteers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page