వీసీగా వైశ్యులకు అవకాశం కల్పించడం అభినందనీయం

0 10

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రవీందర్ గుప్తా కి సన్మానం
వీసీగా వైశ్యులకు అవకాశం కల్పించడం అభినందనీయం

కామారెడ్డి  ముచ్చట్లు :
తెలంగాణ యూనివర్సిటీ వీసీగా వైశ్యులకు అవకాశం కల్పించడం అభినందనీయం వైశ్య సంఘం నాయకులు ఆన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో  తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ గుప్తాను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్యవైశ్యులకు యూనివర్సిటీ వీసీగా అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నిరంగాల్లో ఆర్యవైశ్యులు రాణిస్తున్నారని ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు సహకరించుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు. వ్యాపారలకే పరిమితం కాకుండా విద్యా రంగంలో కూడా చాలామంది వైద్యులు రాణించడం జరుగుతుందని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియామకం కావడం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆర్యవైశ్యుల అందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కైలాస్ శ్రీనివాసరావు గుప్తా, అతిమాముల రమేష్ గుప్తా, విశ్వనాధుల మహేష్ గుప్తా, పాత శివ కృష్ణమూర్తి గుప్తా, గంప ప్రసాద్ గుప్తా, బాలు గుప్తా పాల్గొనడం జరిగింది.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:It is commendable that Vaishyas are given the opportunity to become viz

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page