సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఆగని సంక్షేమం…

0 7

ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
కళ్యాణ లక్ష్మీ, ముఖ్యమంత్రి సహయనిధి చెక్కుల పంపిణీ

జగిత్యాలముచ్చట్లు :

 

 

- Advertisement -

కరోనా విలయతాండవం చేస్తూ వ్యక్తులను ,వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నప్పటికి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు ఆవుతున్న ఏ పథకాన్ని సైతం ఆపలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆన్నారు.మంగళవారం కోరుట్ల పట్టణ, మండల కళ్యాణ లక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మంజూరైన  చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతుల మీదుగా  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 46 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ రూ.46,05,336/- (నలభై ఆరు లక్షల ఐదు వెయిల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు)తోపాటు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా 34 మందికి లబ్ధిదారులకు రూ.18,02,500/- (పద్దెనిమిది లక్షల రెండు వెయిల ఐదు వందల రూపాయలు) చెక్కులను పంపిణీ చేశారు .ఆనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో రాష్ట్రంలో మహిళల ఆత్మ గౌరవానికి అండగా ఉంటూ, మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమని ఆన్నారు.మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టారని, బీడీ పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, ‌కెసిఆర్ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం అబ్బాయికి 12 వేలు, అమ్మాయి 13 వేల రూపాయలు అమ్మఒడి వాహనంలో ఇంటికి చేర్చడం, అంగన్వాడీలలో బాలింతలకు ఆరోగ్య లక్ష్మీ పథకంలో భాగంగా నెలవారీగా గుడ్లు పంపిణీ షీ టీమ్స్ ,ఐకెపి మహిళలు అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు ఇలా ఆడపడుచుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల పరిషత్ అధ్యక్షులు తోట నారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు దారిశెట్టి లావణ్య- రాజేష్,పట్టణాధ్యక్షుడు ఆన్నం ఆనిల్ ,  మున్సిపల్ వైఎస్ చైర్మన్ గడ్డమీది పవన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చిటి వెంకట్రావు, ఆర్డీఓ వినోద్ కుమార్ , మండల తహశీల్దార్ నడిమెట్ల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్ ,వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Unstoppable welfare in the state even in crisis …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page