సీబీఎస్ఈ ఆప్షన్స్ అడుగులు

0 8

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని క్లాసులను ప్రమోట్‌ చేశారు. అయితే, సీబీఎస్‌ఈ ఆగస్ట్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్య ఆప్షనల్‌ ఎగ్జామ్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్‌ఈ. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో అదనపు అఫిడవిట్‌ను ఫైల్‌ చేసింది. మార్కింగ్‌ వ్యవస్థ ద్వారా ఫైనల్‌ మార్క్స్‌ను లెక్కించే విధానంపై వివాదాలు తలెత్తడంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. అలాగే తుది ఫలితాలను జూలై 31న విడుదల చేస్తామని తెలిపింది. అయితే పరీక్ష రాయాలనుకునేవారికి ఆప్షనల్‌ ఎగ్జామ్‌ ఏర్పాటు చేస్తుంది సీబీఎస్‌ఈ. ఈ ఆప్షనల్‌ ఎగ్జామ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆ న్‌ లైన్‌ విధానంలో ఉంటుందని సీబీఎస్‌ఈ తెలిపింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.బోర్డు ప్రకటించే ఫలితాలపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు ఈ ఆప్షనల్‌ ఎగ్జామ్స్‌ రాయొచ్చు. ఆప్షనల్‌ ఎగ్జామ్స్‌ ఎంచుకున్నవారికి ఇందులో వచ్చే మార్కులనే తుది ఫలితంగా పరిగణిస్తారు.

 

 

 

- Advertisement -

ఫలితాలు వచ్చిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆశ్రయించొచ్చు. ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ ఉంటుంది. 40:30:30 నిష్పత్తిలో ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే.. 12వ తరగతి ప్రీబోర్డ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో 40 శాతం, 11వ తరగతి ఫైనల్‌ ఎగ్జామ్‌ మార్కుల్లో 30 శాతం, 10వ తరగతి తుదిఫలితాల మార్కుల్లో 30 శాతం చొప్పున మార్కులను లెక్కించనుంది.ఇక విద్యార్థులు నిరభ్యంతరంగా పరీక్షలు రాయవచ్చు. తమకు నచ్చితే ఆప్షనల్‌ విధానం ఎంచుకోవచ్చు. లేదా ఫార్మూలా ఆధారంగా మార్కులు కేటాయించనుంది సీబీఎస్‌ఈ.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: CBSE Options ft

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page