200 కోట్లేనా… వైరల్ అవుతున్న కామెంట్స్

0 8

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘లైగర్’. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత అదే జోష్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పైగా షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. చిత్ర అప్‌డేట్స్ బయటకు వదిలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో ప్రతిఒక్కరి చూపు ఈ సినిమాపైనే పడింది. ఈ నేపథ్యంలోలైగర్ సినిమాను ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.’లైగర్’ చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందని, పూరి జగన్నాథ్‌ ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్‌, థియేట్రికల్‌ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతోందని.. ఏకంగా 200 కోట్ల భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ రెడీగా ఉందనే న్యూస్ వైరల్ అయింది. పరిస్థితుల్ని బట్టి వచ్చే నెలలో పూరి జగన్నాథ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు.ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా షూటింగ్ ఫినిష్ చేసేసి.. ఓటీటీలో అయినా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని చెప్పుకున్నారు. దీంతో ఈ వార్తలపై నేరుగా రియాక్ట్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ”లైగర్ కోసం 200 కోట్లు చాలా తక్కువని, థియేటర్స్‌లో అంతకంటే ఎక్కువ రాబడతాం” అని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. అంటే ఈ మూవీపై రౌడీ స్టార్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవవచ్చు.వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ మొదలు పెట్టనున్నారట. పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌‌గా నటిస్తోంది.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:200 kotlena … Comments going viral

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page