23 రకాల వంటకాలతో కేసీఆర్ కి మెనూ

0 17

నల్గొండ ముచ్చట్లు :
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు సీఎం. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాల మర్రిలో గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేసి, బహిరంగ సభలో పాల్గొన్నారు కేసీఆర్. దీంతో తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామస్థులు సీఎం కోసం ఎదురు చూశారు. ముఖ్యమంత్రి తమతో పాటు కలిసి భోజనం చేస్తారని తెలియడంతో రకరకాల వంటలు సిద్దం చేస్తున్నారు. 2600 మందితో సీఎం సహఫంక్తి భోజనం చేయనున్నారు.మొత్తం 23 రకాల వంటకాలు సీఎం కేసీఆర్‌కు వడ్డించారు వాసలమర్రి ప్రజలు. మటన్, చికెన్, పప్పు, పచ్చిపులుసుతో సహా 23 రకాల వంటకాలు.. వాసాలమర్రి సహపంక్తి భోజనాల కోసం సిద్ధమయ్యాయి. మటన్, చికెన్, చేపలు, బోటీ, తలకాయ కూర, గుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, పప్పు, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, పచ్చిపులుసు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వంటలు వండిస్తున్నారు.ఈ పర్యటనలో కేసీఆర్‌తో పాటు సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ కమ్యూనిటీ లంచ్‌లో పాల్గొన్న అనంతరం గ్రామంలో వివిధ అభివృద్ధి పథకాలను ప్రకటించారు. ఈ మేరకు సీఎం స్వయంగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులుకు ఫోన్‌లో సూచనలు చేసినట్లు తెలుస్తోంది.2020 అక్టోబర్‌ 31న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం వచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -

Tags:Menu for KCR with 23 types of recipes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page