అభివృద్ధిలో జగిత్యాలను అగ్రపథంలో ఉంచుతాం

0 20

– ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రపతంలో ఉంచుతానని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.బుధవారం పట్టణంలోని 11,12,29వ వార్డులలో
ఎస్సీ సబ్ ప్లాన్,మున్సిపల్ 14వ ఆర్థిక సంఘ నిధులు సుమారు 70 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజి, కూరగాయల మార్కెట్ తోపాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లను జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి తో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగాఎమ్మెల్యే,చైర్ పర్సన్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పట్టణానికి జనాభా ప్రాతిపదికన ప్రతి నెల 90 లక్షల నిధులు అందిస్తూ అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. పట్టణంలో  చాలా సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న జోన్ల సమస్య పరిష్కారం అయ్యిందని, అలాగే యావర్ రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను తొలగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు బాలే లత శంకర్, నక్క జీవన్, పంబాల రామ్ కుమార్,  కౌన్సిల్ సభ్యులు, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, యూత్ అధ్యక్షుడు గిరి, డి.ఈ లచ్చిరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Jagityas will be at the forefront of development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page