ఇండియాలో 40కిపైగా డెల్టా ప్ల‌స్ కేసులు

0 27

-మ‌హారాష్ట్ర‌, ఎంపి , కేర‌ళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర వెల్ల‌డించింది

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

- Advertisement -

ఇండియా ఈ మ‌ధ్యే క‌రోనా ఆందోళ‌నక‌ర వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్ల‌స్ కేసులు దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆ రాష్ట్రాల‌కు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. అయితే ఈ రాష్ట్రాల‌కే ఈ వేరియంట్ ప‌రిమితం కాలేద‌ని, ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మ‌హారాష్ట్ర‌లో 21, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆరు, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లో మూడు, క‌ర్ణాట‌క‌లో 2, పంజాబ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌ల‌లో ఒక్కో కేసు ఉన్న‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి.డెల్లా ప్ల‌స్ వేరియంట్ కేసులు ప్ర‌స్తుతానికి త‌క్కువ‌గానే ఉన్నా.. దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్లు ఎత్తేస్తుండ‌టంతో ఈ కేసులు ఎక్కువయ్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. డెల్టా ప్ల‌స్ కేసులు మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరి, జ‌ల్‌గావ్‌.. కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్‌, ప‌త‌న‌మితిట్ట‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌, శివ్‌పురిల‌లో ఉన్నాయి. త‌మ రాష్ట్రంలో ఈ కేసులు వ‌చ్చిన ప్రాంతాల్లోని వ్య‌క్తులు ఎక్క‌డెక్క‌డ తిరిగారు, వాళ్ల వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితి ఏంట‌న్న‌దానిపై వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర తెలిపింది.డెల్టా వేరియంట్‌లాగే ఇది కూడా చాలా వేగంగా వ్యాపించే వేరియంట్‌. ఇప్ప‌టికే 9 దేశాల‌కు ఇది పాకిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గ‌తంలో డెల్టా వేరియంట్ 80 దేశాల‌కు పాకిన విష‌యం తెలిసిందే. డెల్టా ప్ల‌స్ వేరియంట్ వ్యాక్సిన్‌వనూ బోల్తా కొట్టిస్తున్నాయ‌ని, ప్ర‌స్తుత చికిత్స‌కూ అంద‌డం లేద‌న్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: More than 40 Delta Plus cases in India

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page