ఓయూ విద్యార్థి సురేష్ పై దాడి హేయనీయం

0 38

–  దాడిని ఖండించిన  బీసీ మహిళా రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షురాలు మట్టా జయంతి గౌడ్

 

హైదరాబాద్ ముచ్చట్లు :

 

- Advertisement -

ఓయూ విద్యార్థి సురేష్ పై దాడిని బీసీ మహిళా రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా జేఏసి చేర్మెన్ మట్టా జయంతి గౌడ్ తీవ్రంగా ఖండించారు.. ప్రభుత్వాలు అధికారులు చేసే తప్పులను ఎత్తి చూపినందుకు మొన్న జర్నలిస్ట్  రఘును, అలాగే నిన్న ఓయు విద్యార్థి సురేష్ ని టిఆర్ఎస్ నాయకులు గుండాల ప్రవర్తించే తీరును బిసి సంఘాల తరపున అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తప్పును తప్పని ప్రశ్నించే గొంతులను నొక్కి వేయాలని ప్రయత్నంలో ప్రభుత్వాలు అధికారులు ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి చర్యలు హేయనీయమన్నారు.ఎవరైనా కావచ్చు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నాయకుల కైనా అధికారులైనా హైకోర్టు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి అరాచకాలు ఆపాలని, ఇలాంటి వాటి పై హైకోర్టు సుమోటో గా కేసు తీసుకొని విచారణ జరిపించి ప్రజల్ని కాపాడాలని కోరారు.

 

 

ఇలాంటివి పునరావృతం కాకుండా దాడులు జరగకుండా అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా ప్రభుత్వాల నుండి టిఆర్ఎస్ నాయకుల నుండి పోలీసుల నుండి బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కాపాడాలని జయంతి గౌడ్ విజ్ఞప్తి చేసారు.అలాగే మహిళల పై జరుగుతున్న అరాచకాలు, దాడులు ,వేదింపులు పునరావృతం కాకుండా హైకోర్టు వారు పరిగణనలోకి తీసుకొని దీనికి కారకులైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రతి ఒక్కరు కూడ మన హక్కులను కాపాడుకునే దిశగా అందరు కూడా ముందుకు రావాల్సిందిగా జయంతి గౌడ్ కోరారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Attack on OU student Suresh is heinous

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page