కరోనా ధరలు నిర్ణయిం..ఇలా

0 35

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగింది. సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. అనేకమంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. కోవిడ్ తగ్గిన కూడా ఆ తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యలతో కూడా అనేకమంది చనిపోయారు. దీంతో ఏ మాత్రం లక్షణాలు కనిపించినా.. ఆస్పత్రులకు పరుగులు తీశారు. టెస్టుల కోసం… కోవిడ్ పరీక్షా కేంద్రాలకు క్యూలు కట్టారు. అటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగులతో కిక్కిరిసిపోయాయి. కొందరు ప్రజల్లో నెలకొన్న ఈ భయాన్ని ఆసరాగా తీసుకొని కోవిడ్ చికిత్సకు, టెస్టులకు భారీగా డబ్బులు వసూలు చేశారు.ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ దోపిడీ మరి ఎక్కువగా ఉంది.దీంతో ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ లకు సంబంధించిన ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. ఈ జీవోలో అన్ని రకాల చికిత్స, టెస్టులకు సంబంధించిన ధరల్ని నిర్ణయించింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు నాలుగు వేల రూపాయలు తీసుకోవాలని పేర్కొంది. ఐసీయూ గదిలో రోజుకు 7,500 రూపాయల ఛార్జ్ చేయాలంది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా 9వేల రుపాయలు ఫీజు వేయాలంది.

 

 

 

- Advertisement -

ప్రభుత్వం నిర్ణయించిన ధరల వివరాలు:
పీపీఈ కిట్ ధర రూ. 273
హెచ్ఆర్‌ సీటీ రూ. 1995
డిజిటల్ ఎక్స్ రే రూ. 1300
ఐఎల్6 రూ. 1300 రూపాయలు
డీడైమర్ రూ.300
సీఆర్‌పీ రూ. 500
ప్రొకాల్ సీతోసిన్ రూ.1400
ఫెరిటీన్ రూ. 400
ఎల్‌డీహెచ్ రూ. 140
వీటితో పాటు కోవిడ్ సమయంలో అంబులెన్స్‌ సర్వీసులకు అనేకమంది వేలాది రూపాయలు ఖర్చు చేశారు. కరోనా పేషంట్‌ను తీసుకువెళ్లాలన్నా.. కరోనతో చనిపోయిన మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఈ అంబులెన్స్ ధరలకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సాధారణ అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ. 75 రూపాయలు మినిమం ఛార్జ్ రూ. 2వేలు వసూలు చేయాలని పేర్కొంది. వసతుల తో కూడిన అంబులెన్సుకు కిలోమీటరుకు రూ. 125 రూపాయలు..మినిమం ఛార్జ్ రూ. 3వేలుగా ధరలు నిర్ణయించింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Corona prices are determined

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page