కుటుంబం ఆత్మహత్య

0 40

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు నగరంలోని వడ్డెగేరిలో విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో దంపతులు ప్రతాప్ (42), హేమలత(36) , కుమారుడు జయంత్ (17), కుమార్తె రిషిత (14) ఉన్నారు. ప్రతాప్ టీవీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. జయంత్ డిప్లొమా చేస్తుండగా.. రిషిత ఏడో తరగతి చదువుతోంది.ఉదయం ఎంతసేపటికీ తలుపుతెరవకపోవటంతో.. అనుమానం వచ్చిన బంధువులు తలుపు కొట్టారు. అయినా స్పందించకపోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.  తలుపు పగులగొట్టి చూడగా.. నలుగురూ విగతజీవులుగా పడిఉన్నారు. బంధువులు, స్నేహితులు కరోనా కారణంగా మరణించినందుకే.. మనస్తాపానికి గురై.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Family suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page