కొత్త పింఛన్  చెల్లింపు పై  ట్రెజరీ శాఖకు ధన్యవాదాలు

0 32

జగిత్యాల ముచ్చట్లు :

 

కొత్త పీఆర్సీ ప్రకారం పెంచిన పింఛన్ ను జులై ఒకటో తేదీనే చెల్లించడానికి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వానికి,పెన్షనర్లకు పింఛన్లు అందించడానికి  తీరిక లేకుండా కృషి చేస్తున్నందున జిల్లా ట్రెజరీ అధికారి ఎస్ .పద్మకు జిల్లాలోని,ఎస్టీఓ లకు,ట్రెజరీ శాఖ ఉద్యోగులకు  తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జిల్లా సంఘ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు30 శాతం ఫిట్మెంటు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కొందరు అసత్య ప్రచారాలు పనిగట్టుకొని చేసిన వారికి  పెన్షనర్లకు జులై ఒకటో తేదీన  పింఛన్లు చెల్లింపు కనువిప్పు కావాలన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కు,తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సన్నకు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత రావుకు  ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి  బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,  అసోసియేట్  అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి, ఉపాధ్యక్షుడు వెలముల ప్రకాశ్,మహిళా కార్యదర్శి బోబ్బాటి కరుణ,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, ధర్మపురి అధ్యక్షుడు దొంతుల లక్ష్మికాంతం,అలిశెట్టి ఈశ్వరయ్య, మున్సిపల్ యాకుబ్, గొర్రె విద్యాసాగర్, వనమాల సత్యనారాయణ,రెవెన్యూ యాకూబ్, గంగాధర్,నారాయణ,రాజమల్లయ్య,హన్మాండ్లు, సైఫాద్దీన్, రాజ్ మోహన్,తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Thanks to the Treasury Department on the new pension payment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page